ఏ పని చేయాలన్నా ఏకాగ్రత రావట్లేదా…? అయితే ఇది మీ కోసమే..!

-

సాధారణంగా మైండ్ పని చేస్తూ ఉంటుంది. కానీ పూర్తిగా ఏకాగ్రత దాని పైన పెట్టలేక పోతారు చాలా మంది. ఏదో చేద్దామని అనుకున్నా దాని మీద దృష్టి వెళ్లదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తి ఏకాగ్రత పెట్టకపోవడం తో అన్నిట్లోనూ విఫలమే ఎదురవుతుంది. ఇటువంటి వాటి నుంచి బయట పడాలంటే ఈ మార్గాలని అనుసరించండి. వీటిని అనుసరించడం వల్ల మీరు దృష్టి పెట్టగలరు. మీకు ఏకాగ్రత కలుగుతుంది. మీరు కనుక ఏకాగ్రత పూర్తిగా పెడితే మీకు విజయాలే ఎదురవుతాయి. అయితే ఎప్పుడైతే మీరు మీ పని ప్రారంభించాలని అనుకుంటారో … అప్పుడు మీరు మీ ఫోకస్ ఎక్కువ పెట్టగలరు. దాంతో మీరు ఏకాగ్రతని పెంచుకోవచ్చు.

డిస్ట్రాక్షన్స్ నుండి దూరంగా వచ్చేయండి:

సాధారణంగా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరైనా వెనకాల మాట్లాడటం, లేదంటే ఫోన్ నుంచి మెసేజ్ రావడం… ఇలాంటివి కొన్ని డిస్ట్రబ్ చేస్తాయి. కాబట్టి మీరు ఇటువంటి వాటి నుంచి దూరంగా వచ్చి మీ పని ప్రారంభించండి. అలా చేసినప్పుడు మీరు మీ పనిపై ఏకాగ్రత పెట్టగలరు. మీ దృష్టి కూడా మరొక వైపు వెళ్లదు.

తక్కువ పనులు చేయండి:

ఒకేసారి అన్ని పనులు పెట్టుకోకండి. తక్కువ పనులు తీసుకుని చేయండి. వీలైతే ఒక పని మాత్రమే ఒక సారి చేయండి. అది అయిపోయాక మరో టాస్క్ లోకి వెళ్ళండి.

ప్రశాంతంగా ఉండడం:

మీరు వీలైనంత ప్రశాంతంగా ఉండండి. మీ మైండ్ ని ఫ్రెష్ గా ఉంచండి. దీని కోసం మీరు కావాలంటే మెడిటేషన్ చేయండి. మిమ్మల్ని మీరు నెమ్మదిగా ప్రశాంతంగా ఉండేట్టు చూసుకోండి.

బ్రేక్ తీసుకోండి:

ఒక పని నుండి మరొక పని కి వెళ్ళినప్పుడు మీరు మధ్యలో బ్రేక్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల సమయం వృధా అయిపోతుంది అనుకుంటే పొరపాటు. ఈ విధంగా మీరు కనుక అనుసరించారు అంటే మీ మైండ్ మరింత ఫ్రెష్ గా ఉంటుంది. పైగా మీరు వేగంగా మీ పనులు చేసుకోవచ్చు.

ప్రాక్టీస్ చేయండి:

ఒకవేళ మీరు దేనినైనా నేర్చుకోవాలి అంటే అది వచ్చే వరకు మీరు ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు దానిలో పర్ఫెక్ట్ అవుతారు. ఇలా చేస్తే మీరు కచ్చితంగా సక్సెస్ అవ్వొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news