కాసేపట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి ముఖ్యంగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలు సహా అందరూ హాజరు కావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు పలు కీలాక అంశాలపై చర్చించనున్నట్టు చెబుతున్నారు.
కేసీఆర్ పిలుపుతో అందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఉదయం ఎనిమిదిన్నరకు ఈ సమావేశం మొదలు కానుంది. ఇక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభి వాణీదేవిని టీఆర్‌ఎస్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్నారెడ్డి పోటీ చేస్తున్నారు. అటు బీజేపీ.. సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావునే మళ్లీ బరిలోకి దింపింది.