కవిత అప్రూవర్‌గా మారకుండా ఉండడానికి కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు:ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అప్రూవర్‌గా మారుతోందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.కవిత అప్రూవర్‌గా మారకుండా ఉండడానికి కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టాడని.. ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం ఎమ్మెల్యే యెన్నం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయి.. వాటి కోసం తెచ్చిన అప్పులు మాత్రం కట్టాల్సి వస్తుందని మండిపడ్డారు.

భూస్వాములకు, రియల్టర్లకు రైతు బంధు అమలు నిలిపివేస్తున్న దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో పేరుకు పోయిన సమస్యలను పరిష్కరిస్తున్నాడని, నిరంతరం ప్రజల కోసం తపనపడుతున్నాడని అన్నారు. పాఠశాలల ప్రారంభంలోనే పిల్లలకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారని తెలిపారు. బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో కేసీఆర్ పరిష్కరించలేని సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిష్కరిస్తున్నాడని అన్నారు.మిషన్ భగీరథకు రూ.50 వేల కోట్లు ఖర్చు పెట్టారని.. అందులో మొత్తం అవినీతి, అక్రమాలేనని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ తీసుకొచ్చిన కాళేశ్వరం, మిషన్ భగీరథ ఏ పథకం చూసినా అవినీతి, అక్రమాలేనని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తూ కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news