పాపం; హైదరాబాద్ మెట్రో, తెలంగాణా ఆర్టీసి…!

-

కరోనా రావడం ఏమో గాని ఇప్పుడు తెలంగాణా ఆదాయపరంగా ఇబ్బంది పడుతుంది. ఇన్నాళ్ళు హైదరాబాద్ ఖ్యాతి పెరుగుతుంది ఇబ్బంది లేదు అనుకున్న ప్రహుత్వం మీద కరోనా దెబ్బ పడింది. ఊహించని విధంగా కొట్టిన ఈ కరోనా దెబ్బ ఇప్పుడు ఆర్ధిక వ్యవస్థను ఇబ్బంది పెట్టేస్తుంది. ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ప్రజల్లో అనేక రకాల భయాలు వ్యక్తమవుతున్నాయి. లేని పోనీ ప్రచారాలు అన్నీ నమ్ముతున్నారు.

ఈ దెబ్బ ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థ మీద బాగా పడింది. అలాగే హైదరాబాద్ లో మెట్రో మీద కూడా భారీగా పడింది. రోజు వచ్చే ప్రయాణికుల కంటే దాదాపు 20 నుంచి 30 వేల మంది వరకు తక్కువగా వచ్చారని అధికారులు అంటున్నారు. ఇక హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్టాండ్ నుంచి వెళ్ళే బస్సులు అన్నీ కూడా ఖాళీగా వెళ్తున్నాయి. ఎన్ని విధాలుగా శుభ్రం చేసినా ప్రజలు భయపడుతున్నారు.

మెట్రోలో ప్రతీ ఒక్క దాన్ని అధికారులు శుభ్రం చేస్తున్నారు. అయినా సరే ప్రజల్లో భయం మాత్రం పోవడం లేదు. అసలు చాలా మంది ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళడం లేదు. ఒక్కరు అంటే ఒక్కరు కూడా రోడ్ల మీదకు రావడం లేదు. చాలా మంది ప్రజలు అవసరం అయితే మినహా బయటకు రావడం లేదు. సినిమాలు కూడా చూడటానికి ఇష్టపడటం లేదు. దీనితో తెలంగాణా ఆర్టీసి, మెట్రోలు ఇబ్బంది పడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news