నాగబాబు కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్?? .. ‘ ఇంకో సారి రిపీట్ అయితే ..?

-

గత సార్వత్రిక ఎన్నికల్లో సరిగ్గా నెల రోజుల ముందు జనసేన పార్టీలో చేరారు నాగబాబు. నరసాపురం పార్లమెంట్ స్థానానికి పార్టీ తరఫున పోటీ చేసిన నాగబాబు ఓడిపోయాడు. దీంతో ప్రస్తుతం నాగబాబు వల్ల లాభమెంత.? నష్టమెంత.? అని జనసైనికులు బేరీజు వేసుకునే పరిస్థితి వచ్చింది. మెగా అభిమానుల్లో చాలా వరకు నాగబాబుపై కనబడని కోపం ఉంది. ఇది ఓపెన్ సీక్రెట్. చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్న సమయంలో నాగబాబు అభిమానులపై సీరియస్ అయిన దాఖలాలు మరియు ఘటనలు కూడా ఉన్నాయి. Image result for pawan kalyan to nagababuఆ తర్వాత కుటుంబం లో ఎన్ని గొడవలు అయిన జనసేన పార్టీలో చేరడంతో ఇవి పెద్దగా పట్టించుకోలేదు అని అభిమానులు నాగబాబు జనసేన పార్టీలో చేరిన సందర్భం లో భావించారు. అవన్నీ పక్కన పెడితే నాగబాబు తన రాజకీయ ప్రత్యర్థులపై వేసే సెటైర్లు గట్టిగానే పేలుతుంటాయి. తాజాగా నాగబాబు అలాంటిదే ఇంకో సెటైర్‌ వేశారుగానీ, ఈసారి అది బెడిసి కొట్టేసింది. ‘దేవుడి భక్తుల కి నా ఛాలెంజ్.ఎక్కువ గా గ్రూప్స్ గా వుండొద్దు అని ప్రభుత్వం వారి సూచన..సో మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే మీ ప్రార్ధనాలయాలకి గ్రూప్స్ గా వెళ్లి పూజలు ,ప్రార్ధనలు, ప్రేయర్స్‌ చెయ్యండి. ప్రసాదాలు, తీర్థాలు స్వీకరించండి. సేఫ్‌గా వుంటే దేవుడు గొప్ప తేడా అయితే కరోనా వైరస్‌ గొప్ప’ అన్నది ఆ ట్వీట్‌ సారాంశం.

 

దీంతో ఈ ట్వీట్‌కి అనూహ్యంగా నెటిజన్లు తీవ్రంగా సీరియస్ అయ్యారు. జన సైనికులు కూడా ఇలాంటివి చేస్తే పార్టీపై వ్యతిరేకత వస్తుందని నాగబాబు మీద మండిపడ్డారు. దీంతో విషయం ముదరడంతో పవన్ కళ్యాణ్ తగలడంతో వెంటనే నాగబాబు కి ఫోన్ చేసి..వార్నింగ్ ఇవ్వటం జరిగిందట. ఇంకోసారి రిపీట్ అయితే వేరేలా ఉంటుంది అసలే ప్రజలు భయపడుతుంటే పిచ్చ పిచ్చ కామెంట్లు చేస్తావా..? అంటూ పవన్ సీరియస్ అయినట్లు జనసేన పార్టీలో టాక్. 

Read more RELATED
Recommended to you

Latest news