ఏపీలో ఆవులకు వింతరోగం… వైరస్ సోకిందని ఆందోళన!

-

ప్రస్తుతం ఏ కొత్త సమస్య కనిపించినా.. అది కరోనా వైరస్ అనే భయాలు కనిపిస్తున్న రోజులివి! ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో విజయవాడలో వచ్చిన ఒక కొత్త సమస్యతో… కరోనా వైరస్ భయాలు స్థానికులని కలవరపాటుకు గురిచేసాయి. దీంతో ఇప్పటికే కరోనా వైరస్ భయంతో బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం అయిన కృష్ణాజిల్లా ప్రజలకు మరో కొత్త టెన్షన్ పుట్టుకొచ్చింది. కాకపోతే… అది తోటి మనుషుల నుంచి కాదు… ఆవుల నుంచి!

అవును… కృష్ణాజిల్లా కొండపల్లిలో ఆవులు తాజాగా అస్వస్దతకు గురయ్యాయి. అవి ఒకటో రెండో అయితే కాస్త లైట్ తీసుకుందురేమో కానీ… ఏకంగా 70 ఆవులకు ఒకేసారి ఒకేరకమైన అనారోగ్యం చేసింది. అదేమిటంటే… ఆ 70 ఆవులకు శరీరం మొత్తం ఎర్ర మచ్చలు రావడం, కళ్లలో నుంచి రక్తం కారుతుండటం! దీంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. ఆవులకి కరోనా సోకిందేమో అన్న అనుమానం స్థానికులు వ్యక్తపరచడం మొదలుపెట్టారు. ఈ సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండటంంతో వారి ఆందోళన మరింత రెట్టింపయ్యింది. ఈ సమయంలో స్థానికుల ఫిర్య్యాదు మేరకు స్పందించిన అధికారులు రంగంలోకిదిగి వెటర్నరీ వైద్యులతో పరీక్షలు జరిపించారు. ఆ పరీక్షల్లో వాటికి వైరస్ ఉందని తేలింది! కాకపోతే అది కరోనా కాదు!

ఆవులని పరీక్షించిన వైద్యులు… వాటికి పొంగు జబ్బు వచ్చినట్లు నిర్ధారించారు. అయితే ఇది కూడా వైరస్ సంబంధమైనది కావడంతో ఒక ఆవు నుంచి మరో ఆవుకి.. అలా అన్ని ఆవులకీ పాకి సోకి ఉంటుందని భావిస్తున్నారు. అనంతరం… కరోనా వైరస్ ఆవులకు సోకే అవకాశం లేదని.. ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పడంతో స్ధానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆవులు… స్థానిక వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news