కోవాక్సిన్: జంతువులపై ప్రయోగాలు విజయవంతం.. భారత్ బయోటెక్ ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. మనదేశంలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. రోజూ కొన్ని వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న రెండవ దేశంగా ఇండియా నిలిచింది. మొదటి స్థానంలో అమెరికా ఉంది. ఈ నేపథ్యంలో అందరి చూపు కరోనా వ్యాక్సిన్ పైనే ఉంది. ఇండియాలో భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ ని తయారు చేస్తుంది.

కోవ్యాక్సిన్ పేరుతో తయారవుతున్న ఈ వ్యాక్సిన్ ని జంతువులపై ప్రయోగించారు.
ఈ ఫలితాలు విజయవంతం అయ్యారని ప్రకటించారు. 20కోతులకి కోవ్యాక్సిన్ ని ఇవ్వగా, వాటిలో ఏ కోతికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని, కరోనా ప్రతిరక్షకాలు విపరీతంగా పెరిగాయని తెలిపింది. 20కోతుల్ని నాలుగు గ్రూపులుగా విభజించి ఈ ప్రయోగాన్ని అమలు పరిచారు. 14రోజుల తర్వాత కోతుల్లో రోగనిరోధకశక్తి పెరగడం స్పష్టంగా కనిపించిందని అన్నారు. దీంతో వ్యాక్సిన్ కనిపెట్టడంలో భారత్ బయోటెక్ మరో మైలు రాయిని చేరుకుందన్నమాట.