సాధారణంగా బ్రేక్ ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోస ఇలా ఏదో ఒక్కటి తీసుకుంటాము. అయితే కొందరికి బ్రేక్ ఫాస్ట్ చేసుకోవడానికి సమయం కుదరదు.. అందుకే ఒకేసారి మధ్యాహ్న భోజనం చేస్తూ ఉంటారు. అలా చేయడం మొదటికే మోసం వస్తుంది. లేనిపోని అనారోగ్య సమస్యలు కేరాఫ్ అడ్రస్ గా మారుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బ్రేక్ ఫాస్ట్ చేయడానికి సమయం లేనివారు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. అందులో బాదం పప్పు తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. మరి ఆ ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం..
అమెరికన్ డైటేటిక్ అసోసియేషన్ చేసిన తాజా అధ్యయనం ప్రకారం బాదం తినడం వల్ల, ఎర్ర రక్తకణాలలో విటమిన్ ఇ స్థాయి పెరుగుతుందని నిరూపించబడింది. ఇంకా కొలెస్ట్రాల్ వల్ల వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది.
బాదం పప్పు తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. రక్తప్రవాహంలో ఎక్కువ యాంటీ-ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రక్తపోటును తగ్గించడంతో పాటు శరీరంలోని వివిధ భాగాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
బాదం పప్పులు విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల కణాలను విషపూరితం కాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఆల్జీమర్స్ వ్యాధి, గుండె సమస్యల నుండి కాపాడుతుంది. విటమిన్ ఇ అధికంగా తీసుకోవడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ తో వచ్చే ప్రమాదం ఉంది. కావున విటమిన్ ఇ పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
బాదం పప్పులో అధిక స్థాయిలో ప్రోటీన్స్, ఫైబర్స్ ఉండడంతో పాటు తక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరచడంతో పాటు, అధిక బరువు సమస్య నుండి విముక్తి కలిగిస్తుంది.
బాదం పప్పులో ఎల్ – కార్ని టైన్, రిబోఫ్లావిన్ లు ఉంటాయి. ఇవి మెదడు కణాల పెరుగుదలకు సహాయపడుతాయి. ప్రతి ఉదయం కేవలం అయిదు బాదంలు తినడం వల్ల మీ మెదడు శక్తిని పెంచుకోవచ్చు.