ఏపీ కరోనా అప్డేట్ : 2,849 కేసులు, 15 మరణాలు

-

ఏపీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కాస్త భారీగానే నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఉదృతి నెమ్మదిగా తగ్గుతోంది. అయితే నిన్నటి మీద కేసులు ఈరోజు మళ్ళీ పెరిగాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,849 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 830731కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 15 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6734కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21672 యాక్టివ్‌ కరోనా కేసులు న్నాయి.

ap-corona
ap-corona

ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 802325 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 84,534 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 82,66,800 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 142, చిత్తూరులో 436, తూర్పుగోదావరి జిల్లాలో 394, గుంటూరులో 277, కడపలో 169, కృష్ణాలో 421, కర్నూలులో 35, నెల్లూరులో 93, ప్రకాశంలో 185, శ్రీకాకుళంలో 88, విశాఖపట్నంలో 145, విజయనగరంలో 78, పశ్చిమ గోదావరిలో 386 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news