ప్రజలకు శుభవార్త.. కరోనా టెస్ట్ రేట్లు తగ్గించిన జగన్ సర్కార్..?

-

ఏపీలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతిరోజూ 8,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం భారీగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి సమయంలో జగన్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు తీపికబురు చెప్పింది. కరోనా పరీక్షల రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం నుంచి తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ గతంలో ప్రభుత్వం కరోనా శాంపిల్ టెస్ట్ కు 2,400 రూపాయలు చెల్లించగా ప్రస్తుతం ఆ ధరను 1,600 రూపాయలకు కుదించింది. ప్రైవేట్ ల్యాబ్ లలో కరోనా పరీక్షల కోసం గతంలో 2,900 రూపాయలను నిర్దేశించగా ప్రస్తుతం ఆ ధరను 1,900 రూపాయలకు తగ్గించింది. వైద్య, ఆరోగ్య శాఖ గతంతో పోలిస్తే భారీగా కరోనా కిట్లు అందుబాటులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వుల్లో ప్రజలకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 10,830 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 3,82,469కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 92,208 యాక్టివ్ కేసులు ఉండగా 3,541 మంది మృతి చెందారు. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 53,567 కేసులు నమోదు కాగా 40,845 కేసులతో కర్నూలు జిల్లా రెండో స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news