కరోన ముట్టుకుంటే కాదు.. గాల్లో కూడా వచ్చేస్తోంది జాగ్రత్త !

-

కేవలం స్పర్శతోనే కాదు గాలి ద్వారా కూడా కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే, గాలి ద్వారా కరోనా వైరస్‌ ఎంత దూరం వరకూ ప్రయాణించగలదు? గాల్లో ఎంత సమయం ఉండగలదు? వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి వెలువడ్డ ఎంత సమయం గాల్లో ఉంటుందనే అంశాలపై సెంటర్ ఫర్ సెల్యూలర్ & మాలిక్యులర్‌ బయాలజీ పరిశోధనలు చేస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రి వాతావరణంలో వైరస్‌ వ్యాప్తిపై పరిశోధనలు జరుగుతున్నాయి.

దీని ఫలితాల ఆధారంగా బ్యాంకు, షాపింగ్‌ మాల్స్‌ వంటి ప్రాంతాల్లో పరిశోధనలు చేపడతారు. రోగికి రెండు నుంచి ఎనిమిది మీటర్ల దూరం నుంచి సేకరించిన నమూనాలతో పరిశోధనలు చేస్తామంటున్నారు సెంటర్ ఫర్ సెల్యూలర్ మాలిక్యులర్‌ బయాలజీ శాస్త్రవేత్తలు. ఈ మధ్య రెండొందల మందికి పైగా శాస్త్రవేత్తలు గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందంటూ స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో ఇప్పుడు గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందా? లేదా? అన్నది తేల్చేందుకు ప్రతిష్టాత్మకమైన సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీయంబీ) రంగంలోకి దిగింది.

Read more RELATED
Recommended to you

Latest news