ఆయుర్వేదంతో కరోనాకు చెక్: ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిపై ఆయుష్ ఔషధాలు సమర్ధవంతంగా పనిచేస్తున్న అనేక పరిశోధనలు వెల్లడించాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మానవతావాది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు.

corona
corona

ఈ సమావేశంలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ బయోటెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ ఎండీ డాక్టర్ క్రిస్టియన్ గార్బే, ఆయుష్ విభాగం-న్యూఢిల్లీ అధికారి డాక్టర్ రాజ్ మన్‌చంద్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ సిద్ధ-చెన్నై (సీసీఆర్ఎస్) సైంటిస్ట్ డాక్టర్ కనకవల్లి, శ్రీశ్రీ తత్వ ఎండీ అరవింద్ వర్చశ్వీ, చీఫ్ సైన్స్ ఆఫీసర్ డాక్టర్ రవికుమార్ రెడ్డి పాల్గొన్నారు.

శ్రీశ్రీ తత్వ తయారుచేసిన ఈ మాత్రలను ఢిల్లీలోని పది వేల మందికి ఉచితంగా అందజేయనున్నారు. ఈ మేరకు శ్రీశ్రీ తత్వ చేసిన ప్రతిపాదనపై ఆయుష్ విభాగం అధికారి డాక్టర్ రాజ్ మన్‌చంద్‌ సానుకూలంగా స్పందించారు. రోగనిరోధక శక్తిని మెరుగుపరిచేందుకు కబసురా కుడినీర్‌ను తమిళనాడులో రోగనిరోధక సంరక్షణగా పంపిణీ చేశామని, అది సమర్థవంతంగా పనిచేసినట్టు గుర్తించామని సీసీఆర్ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ కనకవల్లి అన్నారు.

కోవిడ్-19 నిర్వహణలో ఆయుష్ ఔషధాల ప్రభావాన్ని అంచనా వేయడానికి బెంగళూరులోని నారాయణ హృదయాలయ క్లినికల్ అధ్యయనం నిర్వహించారు. ‘సల్ప లక్షణాలతో బాధపడుతున్న రోగులకు కబసురా కుడినిర్ సహా ఆయుష్ యాడ్-ఆన్ థెరపీ కొనసాగింది. ఆయుష్ యాడ్-ఆన్ థెరపీగా ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు తలెత్తలేదని’ క్లినికల్ ఫలితాలు వెల్లడించారు.

ఇక తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న రోగులలో ఉపయోగం కోసం శ్రీశ్రీ తత్వ కబసుర కుడినీర్ టాబ్లెట్లు, శక్తి డ్రాప్స్, టర్మరిక్ ప్లస్ టాబ్లెట్లు సహా ఆయుష్ ఔషధాల భద్రత, సమర్ధతను ఈ అధ్యయనం నిర్ధారించింది. మెడికల్ మెడికల్ కాలేజ్ నిర్వహించిన అధ్యయనంలోనూ ఇదే ఫలితాలు వెల్లడించారు.