హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. అదే కారణమా ?

హైదరాబాద్ లో ఒక మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ నగర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని స్రవంతి(26) ఆత్మహత్య చేసుకుంది. అందుతున్న సమాచారం మేరకు  భర్త రవి కిరణ్, స్రవంతిలు ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. తమ ఇద్దరు పిల్లలతో గత కొంత కాలంగా మియాపూర్ లోని గోపాల్ నగర్ లో నివాసం ఉంటున్నారు.

suicide
suicide

భార్య భర్తల మధ్య గొడవ నేపథ్యంలో ఇంట్లో ఫ్యాన్ కు స్రవంతి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. స్రవంతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకొని మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు చెబుతున్నారు. అయితే భార్యాభర్తల గొడవ ఏనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.