కరోనా మందు రెడీ… త్వరలోనే ప్రపంచానికి…!

-

కరోనా వైరస్ కి మందు అందుబాటులోకి రానుందా…? కొత్త మందులను కనుక్కోవడం కంటే ఉన్న మందులనే దీనికి వాడే అవకాశం ఉందా…? ప్రస్తుతం ఉన్న ఏ వ్యాధి మందు దీనికి సరిగా సరిపోయే అవకాశం ఉంది…? దీనిపై ఇప్పుడు అన్ని దేశాలు ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు కొత్త మందు కనుక్కుని దాన్ని ప్రపంచం మొత్తం పంచడం అంటే అది సాధ్యం అయ్యే పని కాదు.

కాబట్టి ఇప్పుడు ఉన్న కొన్ని మందులను దీనికి వాడే ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని నియంత్రించడంలో 69 రకాల మందులు బాగా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. మలేరియాను తరిమికొట్టే క్లోరోక్విన్ (chloroquine), స్కిజోఫ్రీనియాకి ఇచ్చే హాలోపెరిడోల్ (haloperidol), టైప్ 2 డయాబెటిస్‌కి ఇచ్చే మెట్ఫార్మిన్ (metformin), క్లోరోక్విన్ ఫాస్పేట్ అనే మందు చైనాలో కరోనా వైరస్‌ని కట్టడి చెయ్యడంలో ఉపయోగపడింది.

దీని మీద అమెరికా ప్రయోగాలు చేస్తుంది. ఈ మందులు అన్నీ కూడా కరోనా కణాల మీద దాడి చేసి వాటిని నాశనం చేస్తాయి. తద్వారా కరోనా కణం చచ్చిపోతుంది. బయోఆర్జివ్ (bioRxiv) జర్నల్‌లో 69 మందుల వివరాల్ని స్పష్టంగా పేర్కొన్నారు. కరోనా వైరస్ జన్యువులపై పరిశోధకులు ఆ మందులను ప్రయోగించి చూసారు. ఊపిరితిత్తుల్లో ఏ కణాన్నైనా నాశన చెయ్యాలి అంటే ముందుగా కరోనా వైరస్ జన్యువుని అందులోకి పంపాలి.

అప్పుడు ఆ కణం నుంచీ వైరస్ ప్రోటీన్స్ ఉత్పత్తి అవ్వగా… అప్పుడు కోట్ల కరోనా వైరస్ ఉత్పత్తి అవుతుంది. అది మన శరీరంలో పెరగాలి అంటే మన శరీరంలో ఉన్న కణాలను వాడుకోవడం అనేది అత్యవసరం. కరోనా వైరస్‌కి 29 జన్యువులు ఉండగా… వాటిలో 26 జన్యువులపై తాజాగా ఓ పరిశోధన చేయగా… వైరస్ ఉత్పత్తి ఏ విధంగా ఉంటుందో ఒక అవగాహనకు వచ్చారు. దానిని ఆపడానికి గానూ… 24 రకాల గుర్తింపు పొందిన డ్రగ్స్ బాగా పనిచేస్తున్నాయని తేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news