ప్రపంచానికి ఇప్పుడు భారతే దిక్కు – ప్రపంచ ఆరోగ్య సంస్థ

-

శతాబ్దంలోని అతిపెద్ద అంటువ్యాధుల విపత్తు నుంచి భారత్‌ సమర్థవంతంగా బయటపడింది. ఇప్పుడు కరోనా నుండి కూడా తాను రక్షించుకోవడమే కాదు, ప్రపంచాన్ని కూడా భారతే కాపాడాలి అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

 

 

ప్రపంచం నేడు కరోనా వైరస్‌ గుప్పిట్లో చిక్కి విలవిలలాడుతోంది. చైనాలో పుట్టి, దేశాలకు దేశాలను కబళిస్తోన్న ఈ మహమ్మారి నుండి ఇప్పుడు ప్రపంచాన్ని భారతదేశమే రక్షించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కోరుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎగ్గిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ జె ర్యాన్‌ జెనీవాలో మాట్లాడుతూ, పోలియో, మశూచిలను విజయవంతంగా పారద్రోలిన ఘనత భారత్‌దని, ఇప్పుడు కరోనాను కూడా తరిమికొట్టగల శక్తి ఒక్క ఇండియాకే ఉందని అన్నారు.

ఇప్పుడు పరీక్షాకేంద్రాల పెంపు అవసరం ఎంతైనా ఉంది. భారత్‌ లాంటి అధిక జనసాంద్రత గల దేశాలే కరోనాకు బాసట. కాబట్టి ఈ మహమ్మారిని నాశనం చేసే సామర్థ్యం భారత్‌కు ఉంది. ఎందుకంటే ఇటువంటి రెండు మహమ్మారులను మాయం చేసి, ప్రపంచానికే దారి చూపిన చరిత్ర ఇండియాది అని ర్యాన్‌ తన రోజువారీ నివేదికలో భాగంగా విలేకరులతో ఆన్నారు. ‘‘ నిజానికి, దీనికి సులభమైన మార్గాలేవీ లేవు. భారత్‌లాంటి దేశాలే ఇప్పుడు ఇతరులకు మార్గదర్శనం చేయడమే చాలా ముఖ్యం. వారికా శక్తి ఉంది’’ అని ర్యాన్‌ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా నేటికి 190 దేశాలకు కరోనా సోకగా, 3,34,981 కేసులు పాజిటివ్‌గా తేలాయి. 14,652 మంది కరోనా బారిన పడి మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news