దేశంలో కరోనా కేసులు కనిష్ట స్థాయికి చేరకుంటున్నాయి. ఇటీవల కాలంలో ప్రతీరోజూ కరోనా కేసుల సంఖ్య సగటున 10 వేలకు మించడం లేదు. ఇది మంచి సూచనగా నిపుణులు చెబుతున్నారు. మరణాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గింది. కరోొనా వ్యాక్సినేషన్ పెరగడం కూడా వ్యాధుల తగ్గుముఖం పట్టడానికి కారణం అవుతోంది. గత రెండేళ్లుగా ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వ్యాధి.. భారత్ ను కూడా వణికించింది. అయితే ప్రభుత్వం తీసుకుంటన్న చర్యలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలతో కరోనా కేసుల వేగం చాాాలా వరకు నెమ్మదించింది.
తాజాగా 24 గంటల్లో దేశంలో 6990 కొత్త కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఇదే అత్యంత తక్కువ సంఖ్యగా చెప్పవచ్చు. 24 గంటల్లో 190 మరణాలు మాత్రమే సంభవించాయి. 10,116 మంది 24 గంటల్లో రికవరీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,00,543 గా ఉంది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 0.29 శాతంగా ఉన్నాయి. మొత్తం మరణాలు 1.36 శాతంగా ఉన్నాయి. వ్యాధి నుంచి రికవరీ అయిన వారి శాతం 98.35 గా ఉంది.
ఇండియాలో కేసుల వివరాలు—
మొత్తం కరోనా కేసులు- 3,45,87,822
మరణాలు- 4,68,980
యాక్టివ్ కేసులు-1,00,543
కరోనా వ్యాక్సినేషన్ డోసులు- 123,25,02,767