అంచనాలను కరోనా తలకిందులు చేసిందా…?

-

మన దేశంలో కరోనా వైరస్ వచ్చే అవకాశం లేదని, మనకు ఉష్ణోగ్రతలు ఎక్కువ అని అంచనా వేసారు వైద్యులు కూడా. ప్రజలు కూడా కాస్త దీనిని నమ్మినట్టే నమ్మారు. కాని కరోనా వైరస్ ఇప్పుడు చెలరేగిపోతుంది. మన దేశంలో ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నా సరే కరోనా వైరస్ మాత్రం ఎవరి మాట వినే పరిస్థితి ఇప్పుడు కనపడటం లేదనే చెప్పాలి. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ఈ మహమ్మారి ఇప్పుడు రెచ్చిపోతుంది.

దాదాపు అన్ని దేశాలకు ఈ వైరస్ విస్తరించింది. 130 దేశాల్లో దాదాపు రెండు లక్షల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 22 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే అది బతికే అవకాశం లేదని మన దగ్గర ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయని వైద్యులు అంచనా వేసారు. ఇప్పుడు అది మొండిగా తయారు అయి ఎండను కూడా తట్టుకుని నిలబడి రెచ్చిపోతుంది అంటున్నారు వైద్యులు. ఇప్పుడు ఇండియా లో కరోనా బాధితుల సంఖ్య వంద కు చేరింది.

తెలుగు రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న కర్నాటక, ఓడిస్సా రాష్ట్రాల్లో ఇది క్రమంగా పెరుగుతుంది. దీనితో ఇప్పుడు కరోనా వైరస్ అంటేనే జనం భయపడిపోతున్నారు. ఇండియాలో శుక్రవారం మరో 8 మందికి కరోనా వైరస్ సోకింది. కేరళలో అత్యధికంగా 19 కేసులు నమోదయ్యాయి. హర్యానా, జమ్మూ, మధ్యప్రదేశ్, శ్రీనగర్, కేరళ, కర్ణాటక, యూపీ, ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులిచ్చాయి.

మహారాష్ట్రలోని ముంబై, థానే, నాగపూర్‌లోని థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ ఫూల్స్ ని మూసి వేసారు. తెలంగాణా లో మరో ఇద్దరికీ కరోనా వైరస్ లక్షణాలు కనపడుతున్నాయి. వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స చేసారు. మన దేశం మొత్తం వైరస్ క్రమంగా విస్తరించింది. దీనితో కేంద్ర ప్రభుత్వం ఈ వైరస్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉంది. ఏపీ లో ఒక కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

Read more RELATED
Recommended to you

Latest news