ఏపీలో కోటి మందికి పైగా కరోనా పరీక్షలు..!

-

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడ్డాయి. తాజాగా జగన్ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు చేయించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు కోటి 17వేల 126 పరీక్షలు నిర్వహించింది. అలాగే ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ కూడా అందించింది. ఆదివారం భారీగా సంఖ్యలో డిశ్చార్జిలు కావడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 8 వేలకు పడిపోయింది. ఆదివారం కరోనా నిర్ధారణ పరీక్షలు భారీగానే నిర్వహించినా, కేసులు మాత్రం అత్యల్ప స్థాయికి పోడిపోయాయి. అలాగే కరోనా మరణాలు సైతం తక్కువగానే నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

corona
corona

ఇక ఆదివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 54,710 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 620 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,67,683కి చేరింది. అలాగే కరోనా మరణాలు కూడా స్వల్పంగా పడిపోయాయి. శనివారం కరోనా మహమ్మారి బారిన పడి ఏడుగురు మరణించారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, గుంటూరులో ఒకరు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 6,988కు చేరింది.

అయితే రాష్ట్రంలో డిశ్చార్జిలు ఆదివారం భారీగా నమోదయ్యాయి. ఇటీవలి కాలంలో డిశ్చార్జిలు ఇంత భారీ సంఖ్యలో నమోదు కావడం మొదటిసారి కావడం విశేషం. ఆదివారం 3,787 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,52,298 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 8,397కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,00,17,126 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news