దేశంలో కరోనాను లైట్ తీసుకున్నారా…? జనాలు అనే మాట అదే…!

-

దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఏ మాత్రం కూడా తగ్గలేదు అనే చెప్పవచ్చు. గత 24 గంటల్లో దేశంలో 9 వేల కేసులు నమోదు అయ్యాయి. గంట గంట కు కేసులు వందల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా చూస్తే నాలుగు రాష్ట్రాల్లోనే ఈ కరోనా కేసుల తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. గుజరాత్ మహారాష్ట్ర దేశ రాజధాని ఢిల్లీ తమిళనాడు రాష్ట్రాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు దేశంలో కరోనా విషయంలో ప్రజలు చాలా వరకు లైట్ తీసుకున్నారు అని అంటున్నారు.

లాక్ డౌన్ ని ఉంచండి అని కోరిన ప్రజలు ఇప్పుడు బయటకు వచ్చి రోడ్ల మీద ఎక్కువగా తిరుగుతున్నారు. విజయవాడ హైదరాబాద్ నగరాల్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆగడం లేదు. ముంబై లో కూడా లాక్ డౌన్ లో కొన్ని కొన్ని సడలింపు లు ఇవ్వడంతో ప్రజలు పని ఉన్నా లేకపోయినా సరే రోడ్ల మీదకు వచ్చి తిరగడం ఆశ్చర్యంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది కరోనా వైరస్ ని లైట్ తీసుకున్నారు అనేది స్పష్టంగా చెప్పవచ్చు. వస్తే వచ్చింది రానీయండి అంటూ మాట్లాడుతున్నారు.

అగ్ర రాజ్యాలే కరోనా వైరస్ ని ఏ విధంగా కట్టడి చెయ్యాలో అర్ధం కాక ఇబ్బంది పడుతున్న వేళ మన దేశంలో మాత్రం అది ఇప్పుడు ఒక జోక్ గా మారింది అని నిపుణులు కూడా అంటున్నారు. కరోనా వైరస్ ఉంది అని మనని మనం ఆపుకుంటామా అంటూ మాట్లాడుతున్నారు చాలా మంది. అది కూడా దేశంలో కేసులు పెరగడానికి ప్రధాన కారణం అని నిపుణులు అంటున్నారు ఇప్పుడు గనుక కరోనా ఆగకపోతే మరణాలను కట్టడి చేసే సామర్ధ్యం ప్రభుత్వాలకు కూడా ఉండే అవకాశం ఉండదు అని అందరు అర్ధం చేసుకోవాలి అని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news