కోవిడ్ 19: రక్తం గడ్డకట్టడం.. తెలుసుకోవాల్సిన విషయాలు

-

సెకండ్ వేవ్ ఎంత తీవ్రంగా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్కొక్కరికీ ఒక్కోలా ప్రభావం చూపిస్తున్న కరోనా వైరస్ కొందరిలో రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం తీవ్ర పరిణామాలకి దారితీస్తుంది. ఏదైనా గాయాలు అయినపుడు రక్తం గడ్డకట్టాలి. అలా కట్టకపోతే ఎక్కువ రక్తం పోతుంది. కానీ అలా కాకుండా శరీరం లోపల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ప్రవాహానికి అడ్డు ఏర్పడితే అది ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. రక్తం గడ్డకట్టడం గురించి తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం.

కోవిడ్ వచ్చిన వారిలో ఎవరెకి ఎక్కువ ప్రమాదం ఉంటుందంటే,

కోవిడ్ కారణంగా ఆస్పత్రిలో చేరిన పేషెంట్లు, ముఖ్యంగా గుండె, డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యలు ఉన్నవారిలో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలా అని ప్రతీ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదు. చాలా మందిలో చాలా తక్కువ మందికే ఈ పరిస్థితి వస్తుంది. ఇలా రక్తం గడ్డకట్టడం వల్ల హార్ట్ అటాక్ సంభవించవచ్చు. ఇదే మెదడులో జరిగితే పక్షవాతం రావచ్చు. ఊపిరితిత్తుల్లో జరిగితే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవచ్చు. ఈ విధంగా పెద్ద పెద్ద పరిణామాలు సంభవించవచ్చు.

మరి దీనికి ఎలాంటి వైద్యం ఉంటుంది?

రక్తం గడ్డకట్టడం అనే సమస్యను దూరం చేయడనికి వైద్యులు మందులతో పాటు కొన్ని ప్రత్యేకమైన ఇంజక్షన్లు కూడా ఇస్తారు.

రక్తం గడ్డకట్టడాన్ని ఎలా నివారించవచ్చు?

దీన్ని నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒకే దగ్గర ఎక్కువ సేఫు కూర్చుని పనులు చేయవద్దు. బరువు తగ్గడం, పొగ త్రాగాకుండా ఉండడం మొదలైనవి రక్తం గడ్డ కట్టకుండా నివారిస్తాయి.

కరోనా వైరస్ వల్ల వచ్చే ఇబ్బందులని దూరం చేసుకోవడానికి మాస్క్ పెట్టుకుని, భౌతిక దూరం పాటిస్తూ, పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకుని ఆన్ని నియమాలని అనుసరించండి.

Read more RELATED
Recommended to you

Latest news