ఈ మహమ్మారి సమయంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఇలా చేయండి…!

-

కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఇబ్బందులు తీసుకొస్తోంది. ఇటువంటి సమయం లో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం చాలా ముఖ్యం. విటమిన్ సి కూడా మీ డైట్ లో ఉండాలి. దీనిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఈ రోజు ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మంచి పద్ధతిని చూద్దాం…!

మునగకాయ ఆరోగ్యానికి మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలానే ఉసిరి లో కూడా విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది కూడా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మంచిది ప్రతి రోజు ఉసిరికాయ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. అలాగే ఉసిరి లో క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్స్, బి కాంప్లెక్స్, ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.

అదే విధంగా ఇది శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. అలానే మునగకాయలలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం మరియు పొటాషియం ఉంటాయి. అదే విధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి.

అయితే ఈ రోజు మనము ఈ రెండింటినీ కలిపి ఒక సులువైన జ్యూస్ చేసుకుందాం.. దీని కోసం మీరు ఉసిరికాయలను, 8 నుండి 10 మునగ ఆకుల్ని లేదా పొడిని తీసుకోవాలి. మొదట ఉసిరిలో ఉండే గింజలను తీసేసి.. ఉసిరికాయల్ని, మునగ ఆకుల్ని మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి.

ఇప్పుడు దానిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటే మెత్తగా రుబ్బుకోవాలి. దీనిని వడకట్టి ఆ జ్యూస్ ని తీసుకుని…కాఫీ, టీ కి బదులుగా ఉదయాన్నే తాగితే మంచిది. దీని వల్ల మీకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news