వర్షంలో తడిస్తే కరోనా వచ్చే ఛాన్స్‌!

వర్షం వస్తే చాలు మనుషులే కాదు.. ప్రకృతి సైతం పులకరిస్తుంది. వాన వస్తే గొడుగు లేకుండా తడిసేవారు ఇక జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కరోనా మహమ్మారి వర్షంలో తడిస్తే మనపై విరుచుకు పడటానికి నోరు తెరిచి ఎదురు చూస్తుందట. సాధారణంగా వర్షంలో తడిస్తే మన శరీరంపై వాన నీరు పడుతుంది. ఆ నీటిలో రకరకాల రసాయనాలు ఉంటాయి. దానికి తోడు వాతావరణంలో వచ్చే మార్పులు. అందువల్ల వర్షపు నీరు శరీరానికి తగలగానే… బాడీలో వేడి పెరిగి… ఇమ్యూనిటీ పవర్‌ తగ్గుతుంది. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందో కరోనా సోకే అవకాశాలు పెరిగిపోతాయి. అంతేకాదు… బ్లాక్‌ ఫంగస్‌ కూడా దాడి చెయ్యగలదు అంటున్నారు వైద్య నిపుణులు. అందుకే వర్షంలో తడవవద్దు అని సూచిస్తున్నారు.

కొంత మందికి అప్పటికే జ్వరం ఉంటుంది. వారు వర్షాకాలంలో ఇంట్లోనే ఉండాలని, బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో వారికి బయటి వాతావరణం ఏమాత్రం సెట్‌ కాదు. జ్వరం… చలిజ్వరంగా మారి కరోనా సోకే అవకాశాలు మరింత ఎక్కువ అవుతాయని చెబుతున్నారు.
ఇంకో విషయం కూడా మరచిపోవద్దు. వర్షాకాలంలో… మనం వాడే మాస్కులు తడిసిపోతాయి. మాస్క్‌ తడిసినప్పుడు… దానిపై ఉండే కరోనా వైరస్, వాన నీటిలో కలుస్తుంది. ఆ నీరు… మాస్క్‌ నుంచి మన నోరు, ముక్కుకి తగలగలదు. అందులో కరోనా వైరస్‌ ఉండి… అది ముక్కు లేదా నోటి ద్వారా బాడీలోకి సులభంగా వెళ్తుంది.
వర్షాకాలంలో సీజనల్‌ ఫీవర్లు, జలుబు, తలనొప్పి, దగ్గు, పడిశం వంటివి వచ్చేస్తాయి. అమెరికాలో సీజన్‌ మారినప్పుడల్లా… ఫ్లూ ఇంజెక్షన్లు అందరికీ ఇచ్చేస్తారు. అక్కడి సూపర్‌ మార్కెట్లలో కూడా ఫ్లూ ఇంజెక్షన్లు అమ్ముతారు. ప్రజలు వాటిని చాక్లెట్లు కొన్నట్లుగా కొనుక్కొని… కావాల్సినప్పుడు… డాక్టర్లతో వేయించేసుకుంటారు. మన దేశంలో అలా జరగదు. కాబట్టి… వర్షాకాలంలో మనం మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మన ఇళ్లలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చేసుకోవాలి. లేదంటే… బ్లాక్‌ ఫంగస్, కరోనా పెద్ద మొత్తంలో తిష్ట వేసే ప్రమాదం ఉంటుంది.