వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయినట్టైతే టెస్ట్ రిపోర్ట్ అడగొద్దు: హెల్త్ మినిస్టరీ

-

కరోనా మహమ్మారి వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎంతో మంది ఈ మహమ్మారి వల్ల సతమతమయ్యారు. అయితే తాజాగా యూనియన్ హెల్త్ మినిస్టరీ బుధవారం నాడు కొన్ని విషయాలను చెప్పింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకున్న వాళ్ళు… సెకండ్ డోస్ తర్వాత నుండి 15 రోజులు గడిచాక RTPCR రిపోర్ట్ ని సమర్థించవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం రాష్ట్రాలను కోరింది.

అయితే వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ని తీసుకోవచ్చని విమానం ద్వారా కానీ రైలు ద్వారా కానీ షిప్ ద్వారా కానీ లేదా రోడ్డు మీద ప్రయాణాలు కానీ చేసినట్లయితే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవని చెప్పింది, అయితే జార్ఖండ్, ఛత్తీస్ఘర్ మరియు త్రిపుర ప్రాంతాలలో ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ని పెడుతున్నారని.. తప్పకుండా RTPCR రిపోర్టులను తీసుకురావాలని చెప్పినట్లు తెలుస్తోంది.

వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ మరియు కర్ణాటక ప్రాంతాలలో కొన్ని రూల్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకి కర్ణాటక రాష్ట్రానికి ఎవరైనా కేరళ మహారాష్ట్ర నుండి ప్రయాణం చేస్తూ ఉంటే 72 గంటల ముందు టెస్ట్ చేయించుకుని రావాలని ఆ రిజల్ట్స్ ని తీసుకు రావాలని చెప్పింది. ఇదిలా ఉంటే పూణే, ముంబై, చెన్నై నుండి ఎవరైనా వస్తున్నట్లయితే వెస్ట్ బెంగాల్ టెస్ట్ రిజల్స్ ని తీసుకు రావాలండి. అలానే కాన్పూర్, ఢిల్లీ లేదా ఆగ్రా నుండి ఎవరైనా వస్తున్నట్లయితే ఉత్తర ప్రదేశ్ ఫలితాలని అడుగుతోంది. అయితే వారణాసిలో ఇలాంటి రూల్స్ ఏమీ లేవు. అలాగే ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఒరిస్సా మరియు తెలంగాణ నుండి ప్రయాణం చెయ్యాలంటే ఎలాంటి రూల్స్ లేవు.

 

Read more RELATED
Recommended to you

Latest news