డబల్ మాస్క్ పెట్టుకుంటున్నారా…? అయితే చేయాల్సినవి, చేయకూడనివి చూడండి..

-

కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల డబల్ మాస్కులు ధరించడం సురక్షితమని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. అయితే డబల్ మాస్క్ పెట్టుకునేటప్పుడు చేయకూడనివి చేయాల్సినవి చూడండి.

ఈ విధంగా చేయండి:

డబల్ మాస్క్ అంటే రెండు ధరించడం. వీటిలో ఒకటి సర్జికల్ మాస్క్. మరొకటి రెండు లేదా మూడు లేయర్లు కలిగిన క్లాత్ మాస్క్.

మాస్క్ ని గట్టిగా ప్రెస్ చేసి టైట్ గా ధరించాలి.

మాస్క్ ధరించేటప్పుడు బ్రీతింగ్ బ్లాక్ అవ్వకుండా ఉండేటట్లు చూసుకోండి.

క్లాత్ మాస్క్ ని ప్రతి రోజు వాష్ చేయండి.

ఈ విధంగా చెయ్యద్దు:

రెండు ఒకేలాంటి మాస్కులు ధరించకూడదు.

ఒకే మాస్క్ ని వాష్ చేయకుండా వాడొద్దు.

స్టడీస్ ప్రకారం ఒకే లాంటి మాస్కులు రెండు ధరించడం వల్ల టైట్ గా ఉండి ఇబ్బంది పడాల్సి వస్తుంది.

రెండు మాస్కులు పెట్టుకునేటప్పుడు ఒకటి క్లాత్ మాస్క్, ఇంకొకటి సర్జికల్ అయ్యేటట్టు చూసుకోండి. ఇలా రెండు మాస్కులు పెట్టుకోవడం వల్ల గ్యాప్ ఉండకుండా ఉంటుంది. అదే విధంగా వైరస్ సోకకుండా ఉండడానికి అడ్డుకుంటుంది. మన భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆక్సిజన్ కొరత, బెడ్స్ కొరత కూడా చూస్తున్నాము ఇటువంటి సమయం లో వీలైనంత జాగ్రత్తగా ఉండటం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news