వాహ‌న‌దారుల‌కు గుడ్ న్యూస్‌.. ఎక్స్‌పైర్ అయిన డ్రైవింగ్ లైసెన్స్‌లకు గడువు పెంపు..

-

కరోనా కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా అమ‌ల‌వుతున్న లాక్‌డౌన్‌తో దేశంలోని అనేక మంది వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం విదిత‌మే. అయితే వారికి కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్ప‌టికే ఎక్స్‌పైర్ అయిన డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహ‌నాల రిజిస్ట్రేష‌న్లు, ఫిట్‌నెస్ ప‌ర్మిట్లు.. త‌దిత‌రాలు ఉన్న‌వారు దిగులు చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని.. వాటికి గ‌డువును మ‌రికొంత కాలం పెంచుతున్నామ‌ని కేంద్రం తెలిపింది. ఈ మేర‌కు కేంద్ర ర‌వాణా మంత్రిత్వ శాఖ రాష్ట్రాల‌కు ఆదేశాలు జారీ చేసింది.

expired driving licences and vehicle registrations validity extended till June 30

ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు ఎక్స్‌పైర్ అయిన డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహ‌నాల రిజిస్ట్రేష‌న్లు, ఫిట్‌నెస్ ప‌ర్మిట్లకు జూన్ 30వ తేదీ వ‌ర‌కు గ‌డువును పెంచిన‌ట్లు కేంద్ర రవాణా శాఖ తెలిపింది. ఈ క్ర‌మంలో ఎక్స్‌పైర్ అయిన స‌ద‌రు ప‌త్రాలు ఉన్న‌ప్ప‌టికీ జూన్ 30వ తేదీ వ‌ర‌కు అవి చెల్లుతాయ‌ని.. క‌నుక సంబంధిత అధికారులు వాటిని ఇంకా ఎక్స్‌పైర్ కాన‌ట్లుగానే గుర్తించాల‌ని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

కరోనా లాక్‌డౌన్‌తో ట్రాన్స్‌పోర్టు కార్యాల‌యాలు మూసి ఉన్నాయ‌ని.. క‌నుక ఆయా పత్రాల రెన్యువ‌ల్ విష‌యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహ‌న‌దారుల కోస‌మే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఈ క్ర‌మంలో ఎక్స్‌పైర్ అయిన ప‌త్రాలు ఉన్నా.. అధికారులు వాహ‌న‌దారుల‌ను అనుమ‌తించాల‌ని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు అన్ని రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌భుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు ఈ ఆదేశాల‌ను పాటించాల‌ని కేంద్రం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news