మరో ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌కు ఐసీఎంఆర్‌ పచ్చజెండా!

-

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రతిరోజూ దానికి సంబంధించిన కొత్త పరికరాలు, మందులను కనుక్కుంటునే ఉన్నారు. తాజాగా ఇంట్లోనే మనం కరోనా టెస్ట్‌ చేసుకునే రెండో ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌కు ఐసీఎంఆర్‌ ఆమోదం తెలిపింది. దీన్ని చికాగోకు చెందిన అబ్బోట్‌ రాపిడ్‌ డయాగ్నొస్టిక్స్‌ విభాగం అభివృద్ధి చేసింది. ఇది ప్యాన్‌బయో కొవిడ్‌ 19 యాంటిజెన్‌ టెస్ట్‌ డివైస్‌. ఈ కిట్‌కు సంబంధించిన పూర్తి స్థాయి ఆమోదం జూలై 5కు రానుంది. అప్పుడే కిట్‌కు సంబంధించిన ధర ఇతర సమాచారం వెలువడించనుంది. ఐసీఎంఆర్‌ గతంలో కూడా కొవీసెల్ఫ్‌కు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే! ఇది పూణెకు చెందిన మైలాబ్‌ డిస్కవరీ సొల్యూషన్‌ తయారు చేసింది. దాని ధర రూ. 250.

ఐసీఎంఆర్‌ సలహా మేరకు ఈ కిట్‌ పూర్తి వివరాలు తెలియకుండా వాడకూడదు. కేవలం లక్షణాలు ఉన్నవారు, పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారు మాత్రమే ఉపయోగించాలని ర్యాట్‌ (RAT) తెలిపింది.
యూజర్ల అవగాహన మేరకు ఉత్పత్తిదారులు ఇచ్చిన పద్ధతుల్లోనే ఈ కిట్‌ను వాడాలి. ముందుగా గూగుల్‌ ప్లేస్టోర్‌ లేదా యాపిల్‌ స్టోర్‌ నుంచి హోం టెస్టింగ్‌ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈ యాప్‌ సమగ్ర ఆదేశాలను ఇస్తుంది. ఆ విధానంతో టెస్ట్‌ చే సుకుంటేనే రోగికి పాజిటివ్‌ లేదా నెగెటివ్‌ ఫలితం వస్తుంది. ఆ తర్వాత సంబంధిత టెస్ట్‌ పిక్చర్‌ను మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసిన ఫోన్‌ ద్వారానే తీయాల్సి ఉంటుంది. మీ డేటా భద్రంగా ఐసీఎంఆర్‌ కొవిడ్‌ 19 పోర్టల్‌కు నిక్షిప్తం అవుతుంది. పాజిటివ్‌ వచ్చిన వారిని మాత్రమే కొవిడ్‌ పేషెంట్లు›గా నిర్ధారిస్తారు. వీళ్లు మళ్లీ పరీక్షించుకోవాల్సిన అవసరం ఉండదు. పాజిటివ్‌ వచ్చినవారు ఐసీఎంఆర్‌ ఆదేశించిన నియమాల ప్రకారం హోం ఐసోలేషన్‌ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ లక్షణాలు ఉండి ర్యాపిడ్‌ టెస్ట్‌లో నెగెటివ్‌ వస్తే వెంటనే ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ వైరల్‌ ఇన్ఫెక్ట్‌ అయితే ర్యాపిడ్‌ టెస్ట్‌లో మిస్‌ అయ్యే ఛాన్స్‌ ఉంటుంది. ఈ కిట్‌కు సంబంధించిన వీడియో లింక్‌లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. మానుఫ్యాక్చరర్‌ నిర్ధేశించిన విధంగానే వాడిన టెస్ట్‌ కిట్, స్వాబ్‌ ఇతర మెటిరీయల్‌ పడేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news