జర్మన్ ఔషధ సంస్థ కీలక ప్రకటన.. జూన్ నాటికి 12-15 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్..!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మార్చి 1వ తేదీన భారతదేశంలో 18 ఏళ్లకు పైబడిన వారికి కరోనా వ్యాక్సినేషన్ చేయనున్న సంగతి విదితమే. అయితే యూరప్‌లో 12 నుంచి 15 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నట్లు జర్మన్ ఔషధ తయారీ సంస్థ బయోనోటెక్ తెలిపింది. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు తీసుకున్న కరోనా.. ఇప్పుడు చిన్న పిల్లల్లోనూ సంక్రమిస్తోంది. దీంతో బయోనోటెక్ ఈ నిర్ణయం తీసుకుంది. జర్మన్ ఔషధ తయారీ సంస్థ బయోనోటెక్ ఫైజర్ టీకా 12-15 ఏళ్ల పిల్లలపై సమర్థవంతంగా పనిచేస్తుందని వెల్లడించారు. మార్చి చివరి నాటికి 2,260 మంది అమెరికన్ వాలంటీర్లపై పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధనల్లో ఫైజర్ టీకా చిన్నపిల్లలకు కరోనా నివారణలో సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రకటించారు.

ఫైజర్ టీకా
ఫైజర్ టీకా

చిన్న పిల్లలకు ఫైజర్ టీకా ఎంతో సురక్షితమైనదని బయోనోటెక్ తెలిపింది. పాఠశాలలకు వెళ్లే పిల్లలకు, 12 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్లుకు వ్యాక్సిన్ వాడకం ఎంతో ముఖ్యమన్నారు. ఈ మేరకు అనుమతుల కోసం యూఎస్ఎఫ్‌డీఏ, యూరోపియన్ రెగ్యూలేటర్లకు నివేదించినట్లు ఫైజర్ సీఈఓ ఎర్లాబ్ బౌర్లా తెలిపారు. ఈ టీకా 12-15 ఏళ్ల పిల్లల్లో 100 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌పై ప్రయోగాలు నిర్వహించామని, వాటికి సంబంధించిన ఆధారాలను సమర్పించామన్నారు. జూన్ నాటికి చిన్నపిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందన్నారు. ప్రస్తుతం పిల్లల కోసం వ్యాక్సిన్ తయారు చేయడానికి పలు వ్యాక్సిన్ తయారీ సంస్థలు పోటీ చేస్తున్నాయి. అమెరికన్ కంపెనీ మోడెర్నా కూడా పరిశోధన చేస్తుందన్నారు. ఆస్ట్రాజెనెకా కూడా 6-17 ఏళ్ల పిల్లల కోసం వ్యాక్సిన్ తయారీ కోసం గత నెలలోనే పరిశోధన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

6 నెలల పిల్లవాడికి కూడా..
యూఎస్ ఔషధ తయారీ సంస్థలు ఇటీవల ఫైజర్, మోడెర్నా టీకాలపై పరిశోధన నిర్వహించారు. తల్లిదండ్రుల సమ్మతి మేరకు 6 నెలల పిల్లలపై వ్యాక్సిన్ పరీక్షించి చూశారు. ఈ కొత్త టీకాలు నవజాత శిశువులపై సమర్థవంతంగా పనిచేస్తున్నాయని రెండు సంస్థలు తెలిపారు. ఈ మేరకు రెండవ దశ ట్రయల్ రన్స్ కూడా ప్రారంభించింది. ఇందులో 5వేల పిల్లలపై పరిశోధన చేయనున్నారు. ఈ పరీక్షల్లో సక్సెస్ అయితే త్వరలోనే టీకాను మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు ఆయా కంపెనీలు పేర్కొన్నాయి. ఈ మేరకు మోడెర్నా తన పరిశోధనను రెండు విభాగాలు నిర్వహించింది. మొదటి దశలో 2-12 ఏళ్ల పిల్లలకు రెండు మోతాదులో టీకా ఇవ్వనుంది. ప్రతి టీకా మోతాదు 50 లేదా 100 మైక్రోగ్రాములు ఉంటుందని కంపెనీ తెలిపింది. రెండవ భాగంలో 25, 50, 100 మైక్రోగ్రాముల టీకా 2 ఏళ్ల కంటే తక్కువ వయసు పిల్లలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. అన్ని జాగ్రత్తల నడుమ పరిశోధన నిర్వహిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.