బ్రేకింగ్: తిరుపతి ఉప ఎన్నిక రద్దు పిటీషన్ పై హైకోర్ట్ షాకింగ్ నిర్ణయం

తిరుపతి ఉప ఎన్నికలు ఈ మధ్య కాలంలో అత్యంత వివాదాస్పదంగా మారాయి. దొంగ ఓట్లు నమోదు చేసారు అనే దానికి సంబంధించి తీవ్ర స్థాయిలో విపక్షాల నుంచి ఆరోపణలు వచ్చాయి. టీడీపీ నేతలు అయితే వీడియో లను కూడా విడుదల చేసారు. బిజెపి, జనసేన, కాంగ్రెస్ పార్టీలు దీనికి సంబంధించి వీడియోలను విడుదల చేయడమే కాకుండా ఎన్నిక రద్దు చేయాల్సిందే అనే డిమాండ్ లు చేసాయి.

ap high court

ఈ క్రమంలో బిజెపి అభ్యర్ధి రత్న ప్రభ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. దీనిపై దాఖలు చేసిన పిటీషన్ లు అన్నీ ఏపీ హైకోర్ట్ కొట్టేసింది. ఈ సమయంలో తామ్ము జోక్యం చేసుకోలేమని కోర్ట్ క్లారిటీ ఇచ్చింది. దీనితో ఉప ఎన్నిక కౌంటింగ్ కి దాదాపుగా లైన్ క్లియర్ అయింది.