కరోనా బాధితులకు కేంద్రం గుడ్ న్యూస్…!

-

భారత్ లో కరోనా వైరస్ ని అడ్డుకోవడానికి గాను కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. విదేశీయులకు ఇప్పటికే వీసాలను రద్దు చేస్తూ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఐపిఎల్ ని కూడా వాయిదా వేసారు. పలు రాష్ట్రాలు షట్ డౌన్ ని ప్రకటించాయి. తెలంగాణా సర్కార్ కూడా మార్చ్ 31 వరకు పలు ఆంక్షలు విధిస్తూ ప్రజలకు హెచ్చరికలు కూడా చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సిఎం కేసీఆర్ సూచించారు.

ఇది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కరోనా వైరస్ వల్ల రోగులకు ఎలాంటి ట్రీట్‌మెంట్ చేసినా ఆ మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. కరోనా పాజిటివ్ కేసులు 84గా ఉన్నాయి. ఐతే… ఈ 84 మందితో దగ్గరగా ఉన్న మరో 4000 మందిని కేంద్రం ప్రత్యేకంగా ఉంచి వైద్య పరీక్షలు జరిపిస్తోంది. ఏడుగురికి కరోనా పూర్తిగా తగ్గిపోయింది. వాళ్లను శనివారం ఆస్పత్రుల నుంచీ డిశ్చార్జి చేశారు.

మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని పలు దేశాలు అభినందిస్తున్నాయి. కరోనా వైరస్ వల్ల ఇద్దరు చనిపోవడంతో… ఆ ఇద్దరి కుటుంబాలకూ రూ.4 లక్షల పరిహారం మోడీ సర్కార్ ప్రకటించింది. ఇక ప్రపంచంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. దాదాపు 150 దేశాలకు వైరస్ విస్తరించింది. ఆఫ్రికా దేశాలకు కూడా విస్తరించింది. ఇటలీ, ఇరాన్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రత మరీ ఎక్కువగానే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news