భార‌త క్రికెటర్లూ.. ఎక్క‌డ ఉన్నారు..? క‌రోనాపై మీ స్పంద‌న ఏదీ..?

-

స్టేడియాల‌లో మీరు సిక్స‌ర్లు.. ఫోర్లు కొడుతుంటే.. మేం మీకు ఉత్సాహాన్ని క‌లిగిస్తూ.. చ‌ప్ప‌ట్లు కొట్టాం.. మీరు ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు స‌భ్యుల వికెట్లు తీస్తుంటే.. మేం ఈల‌లు వేసి మిమ్మ‌ల్ని ఎంక‌రేజ్ చేశాం.. ఎన్ని కీల‌క‌మైన మ్యాచ్‌ల‌లో మీరు ఓట‌మి పాలైనా.. మీకు మేమున్నామంటూ.. అన్ని స‌మ‌యాల్లోనూ మ‌ద్ద‌తుగా నిలిచాం. కానీ మాకు క‌ష్టం వ‌చ్చిన స‌మ‌యంలో మాత్రం మీరు క‌నిపించ‌కుండా పోయారు.. మా బాధ‌ల్ని ప‌ట్టించుకుంటార‌ని మీకు ఒక‌ప్పుడు అభిమానులుగా ఉన్నాం.. కానీ మా అభిమానాన్ని మీరు మ‌రిచారు.. మేము దేశంలో ఉన్నామ‌ని.. మాకు క‌ష్టాలు ఉన్నాయ‌ని.. తెలిసినా.. మీరు మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం మ‌మ్మ‌ల్ని ఇంకా బాధ‌కు గురి చేస్తోంది…. ఇవీ.. క్రికెట్ అభిమానులు ప్ర‌స్తుతం అంటున్న మాట‌లు..

indian cricket fans angry over players and bcci

దేశ‌వ్యాప్తంగా క‌రోనా బాధితుల‌కు స‌హాయం చేసేందుకు ఇప్ప‌టికే ఎంతో మంది ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌లు, సినీ ప్ర‌ముఖులు, దాత‌లు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, కార్పొరేట్ కంపెనీలు ముందుకు వ‌చ్చాయి. కొన్ని కోట్ల రూపాయాల విరాళాల‌ను వారు అందించారు. కానీ ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐతోపాటు.. ఏటా కోట్ల రూపాయల‌ను ఆర్జించే భార‌త క్రికెట్ ఆట‌గాళ్లు కూడా.. క‌రోనాపై ఎలాంటి విరాళం ప్ర‌క‌టించ‌లేదు. క‌నీసం స్పందించ‌లేదు. దీంతో క్రికెట్ అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

క‌రోనాపై పోరాటానికి రూ.51 కోట్ల విరాళం అందిస్తున్న బీసీసీఐ ఆల‌స్యంగా అయినా స్పందించింది. కానీ దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ ఇంత త‌క్కువ మొత్తం విరాళం ఇవ్వ‌డం దారుణ‌మ‌ని అంటున్నారు. ఇక ట్విట్ట‌ర్‌లో #ShameOnBCCI పేరిట ఓ హ్యాష్‌ట్యాగ్‌ను కూడా వైర‌ల్ చేస్తున్నారు. ఇంత తంతు జ‌రుగుతున్నా.. అటు క్రికెట‌ర్లు.. ఇటు బీసీసీఐ స్పందించ‌లేద‌ని.. క్రికెట్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి వారు ఈ విష‌యాన్ని ప‌ట్టించుకుంటారా.. లేదా..? అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news