వైయస్ జగన్ ని దారుణంగా విమర్శించే వారిలో ఒకరు సబ్బం హరి. వైసీపీ పార్టీ పెట్టకముందు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన వైయస్ జగన్ కి చాలా సపోర్టుగా సబ్బం హరి ఉండేవారు. ఇదే టైమ్ లో వైయస్ జగన్ కూడా సబ్బం హరికి మంచి ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే అనూహ్యంగా 2014 టైములో రాష్ట్రం విడిపోవటం అదే టైంలో ఎన్నికల సమయంలో సబ్బం హరి ఒక్కసారిగా వైఎస్ జగన్ కి వ్యతిరేకం కావడం జరిగింది.అంతేకాకుండా 2014 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విషం కక్కడం స్టార్ట్ చేశారు. జగన్ రాయలసీమకు చెందిన ఒక కక్షసాధింపు రాజకీయ నాయకుడు అని, ఒక నియంత అంటూ ఇంకా రకరకాలుగా చాలా దారుణమైన వ్యాఖ్యలు సబ్బం హరి చేయడం జరిగింది. అంతేకాకుండా 2019 ఎన్నికల టైంలో లో సర్వ నాశనం, జగన్ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వ నాశనం అవ్వడం గ్యారెంటీ అని పలు మీడియా ఛానల్ లో చేసిన కామెంట్లు అప్పట్లో హైలైట్ అయ్యాయి. కానీ ప్రజలు అవేమీ పట్టించుకోకుండా వైఎస్ జగన్ కి అద్భుత మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్ర రాష్ట్రాన్ని వైయస్ జగన్ ఉగాండా మాదిరిగా మార్చేశారని షాకింగ్ కామెంట్ చేశారు.
దీంతో వైసిపి నాయకులు సబ్బం హరి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వైయస్ జగన్ సబ్బం హరి కి మంచి ప్రాధాన్యత ఇస్తూ వైసిపి పార్టీ గురించి అత్యున్నత విషయాలు చెవిన వేస్తే వాటిని అప్పట్లో టీడీపీకి చేరవేసిన కోవర్ట్ అని ఇపుడు అసలు బ్రేకింగ్ పాయింట్ లాంటి నిజాలు బయటపెడుతున్నారు. ఇందు మూలంగానే సబ్బం హరికి రాజకీయంగా సబ్బం హరికి దెబ్బపడి ఉండొచ్చు అని తాజా పరిణామాలపై రాజకీయవిశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. జగన్ పార్టీపరంగా మరియు వ్యక్తిగతంగా తనని మోసం చేసిన వాళ్ళకి తిరిగి అదే రీతిలో కోలుకోలేని దెబ్బ కొడతాడు అని ఏపీ రాజకీయాల్లో ఎప్పటినుండో ఓ బలమైన టాక్ వుంది. దీంతో ఈ విధంగా తన పొలిటికల్ కెరియర్ లో వెన్నుపోటు లాంటి దెబ్బ కొట్టాలని చూసిన సబ్బంహరి కి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా ప్రస్తుతం ఇంటికే పరిమితం చేశారని..అందువల్లే సబ్బం హరి ఎప్పటికప్పుడు జగన్ పై విషం కక్కే మాటలు మాట్లాడుతూ ఉంటారేమో అని మరి కొంతమంది రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.