కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చట్లేదు.. అసలు కారణం ఇదేనా!

-

ఆరోగ్య శ్రీ అంటే పేదోళ్ల పాటిటి ఆపన్నహస్తం. ఏ రోగం వచ్చినా.. దీన్ని చూపించి ప్రయివేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునేటోళ్లు. మరి ఇంత పెద్ద కరోనా రోగానికి ఆరోగ్య శ్రీలో ఎందుకు చేర్చట్లేదనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే ప్రతిపక్షాలు, ప్రజలు ఎన్నో సార్లు అడిగినా.. ప్రభుత్వం దీనిపై పెద్దగా స్పందించట్లేదు. అసలు తెలంగాణలో ఆరోగ్య శ్రీలో కరోనాను ఎందుకు చేర్చట్లేదనేదానిపై కాస్త ఆలోచిద్దాం.

coronavirus
coronavirus

కరోనా వచ్చి ఏడాది దాటుతోంది. ఇప్పటికే ఎంతో మంతి దీని వల్ల ప్రాణాలు కోల్పోయారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స రోజుకు కనీసం రూ.30వేల పై చిలుకు ఉంది. మరి ప్రయివేటు ఆస్పత్రుల్లో చూపించుకోలేని వారి పరిస్థితి ఏంది? అనేదే సమస్య. ఆరోగ్య శ్రీ ఉంటే చాలా మంది చికిత్స తీసుకుని బతికేటోళ్లు అని ప్రతిపక్షాలు బల్ల గుద్ది చెబుతున్నాయి. మొదట్లో అన్ని రాష్ట్రాలు దీన్ని ఆయుష్మాన్ భారత్ లో చేర్చినా.. కేసీఆర్ టీం దీంట్లో కూడా చేర్చలేదు. తీవ్ర ఒత్తిడిల తర్వాతే ఆయుష్మాన్ భారత్ లో చేనింది.

మరి అదంటే కేంద్ర పథకం కానీ ఆరోగ్య శ్రీరాష్ట్ర పథకమే కదా. మరి దీన్ని ఎందుకు విస్మరించిందో చెప్పాలంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే ఈ డిమాండ్ పై ఎమ్మెల్యే సీతక్క దీక్ష కూడా చేస్తోంది. కానీ గవర్నమెంట్ మాత్రం దీనిపై నోరు మెదపట్లేదు. దీనికి కొన్ని కారణాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇతర రోగాలకు ఆరోగ్య శ్రీ బిల్లులు చాలా పెండింగ్ లో ఉన్నాయి. గవర్నమెంట్ దీనికి పెద్దగా నిధులు కేటాయించట్లేదు. నిధులు లేవనే కారణంగా దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇక కరోనాను ఇందులో చేర్చితే.. పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలి. ఒక్క వారం బిల్లులు ఆగినా.. ప్రభుత్వానికి మచ్చ వస్తుంది. కాబట్టి దీని జోలికి పోకుండా ఉండటమే బెటర్ అని గులాబీ టీం భావిస్తోందంట.

Read more RELATED
Recommended to you

Latest news