రెమెడిసివేర్ బ్లాక్ లో అమ్మితే ఈ నెంబర్ కు ఫోన్…!

రెమిడిసివేర్ నిల్వలు – వినియోగం, ఆక్సిజన్ నిల్వలు – వినియోగం, ఫీజుల పేరిట దోపిడీ మొదలైన పలు అంశాలపై నిరంతర నిఘా పెట్టారని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వివరించారు.  రెమిడిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ కంట్రోల్ మరియు మెడికల్ అండ్ హెల్త్ శాఖల సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తామని అన్నారు.

రెమెడిసివేర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ సిలెండర్లు బ్లాక్ మార్కెట్లలో అమ్ముతున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కు, 1902 కు ఫోన్ చేయండి అని ఆయన సూచించారు. కోవిడ్ రోగుల నుండి ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఫీజు లపై ఆరా తీస్తున్నాం. పరిమితికి మించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అట్టి సమాచారాన్ని డయల్ 100, 1902 ద్వారా చేరవేయండి అని ఆయన సూచనలు చేసారు. ఆక్సిజన్ వాహనాలకు రవాణా పరమైన ఇబ్బందులు కలగకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసామని తెలిపారు.