అందరికీ వ్యాక్సిన్.. నాలుగేళ్ళు టైమ్.. సీరం ఛీఫ్..

-

కరోనా వైరస్ ని నివారించడానికి వ్యాక్సిన్ వస్తుందన్న వార్తలు జనాల్లో ఆందోళనని తగ్గిస్తున్నాయి. వ్యాక్సిన్ పై ప్రయోగాలు జరుగుతున్నాయి కాబట్టి మరికొద్ది రోజుల్లో వ్యాక్సిన్ వచ్చేస్తుందని నమ్ముతున్నారు. ఐతే వ్యాక్సిన్ వస్తుంది నిజమే. కానీ భూమి మీద ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలంటే కనీసం నాలుగేళ్ళు పడుతుందని సీరం ఛీఫ్ ఆదార్ పూనావాలా అంచనా వేస్తున్నాడు. మనిషికి రెండు డోసుల చొప్పున వేసుకుంటే మొత్తం 15బిలియన్ల మోతాదులు అవసరం అని అంటున్నాడు.

అందువల్ల వ్యాక్సిన్ కనుగొన్నా గానీ అందరికీ చేరాలంటే 2024 వరకూ టైమ్ పడుతుందని చెబుతున్నాడు. ప్రస్తుతం సీరం ఇన్స్టిట్యూట్, వ్యాక్సిన్ తయారు చేసే పనిలో నిమగ్నమై ఉంది. అస్ట్రాజెంకా, నోవావాక్స్ అనే కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్న సీరం ఇన్స్టిట్యూట్, మొత్తం తయారైన వ్యాక్సిన్లలో 50శాతం భారత్ కే అప్పగించనుంది. సీరం సంస్థ, రష్యాలో తయారవుతున్న స్పుత్నిక్ వ్యాక్సిన్ తో భాగస్వామ్యం పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. వ్యాక్సిన్ వస్తుందని సంబర పడుతున్న జనాలకి సీరం ఛీఫ్ మాటలు, నిరాశ కలిగించాయి.

Read more RELATED
Recommended to you

Latest news