కర్ణాటక తో లాక్ డౌన్ ఎత్తివేత మొదలు అవ్వబోతోందా ?

-

మే 3వ తేదీ తర్వాత కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగింపు మళ్లీ ఉంటుందా లేకపోతే ఎత్తి వేస్తుందా..? అన్న దాని విషయంలో దేశ ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. రెండో దశ లాక్ డౌన్ చివరి దశకు చేరుకోవడంతో ఆటో మరోపక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో అందరూ చాలా టెన్షన్ గా ఉన్నారు.Karnataka Locks Down Nine Covid-19 Affected Districts Until Month ...ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఏ విధానం అనుసరిస్తోందో అన్న దానిపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉండగా కర్ణాటక ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం మే 3 తర్వాత లాక్ డౌన్ ఎత్తి వేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో గ్రీన్ జోన్ ప్రాంతాలలో లాక్ డౌన్ ఉపసంహరించడం నికి ఇప్పటికే ప్రభుత్వం రెడీ అయినట్లు సమాచారం.

 

కేంద్రం యొక్క ప్రకటన తో సంబంధం లేకుండా కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఇప్పుడు కొత్త వార్త బయటకు వచ్చింది. దీంతో కేంద్రం లాక్ డౌన్ ఎత్తివేత విషయంలో పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికే ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు అర్థమవుతుంది. కానీ షాపింగ్ మాల్స్ మరియు సినిమా థియేటర్లు అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో అనుమతులు ఇవ్వకుండా కేంద్రం సరికొత్త లిస్ట్ తయారు చేస్తున్నట్లు టాక్. దీన్నిబట్టి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రం నుండి లాక్ డౌన్ ఎత్తివేత కార్యక్రమం మొదలు చేయబోతున్నట్లు అర్థమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news