లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు మూడు నెలల వరకు దేశంలోని అన్ని దేవాలయాలు మూసివేసిన సంగతి అందరికీ విదితమే. అయితే తాజాగా టీటీడీ స్వామివారి ఆస్తులపై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని టీటీడీ పాలక వర్గం తెలియజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో స్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేమని తెలియజేశారు. అయితే ప్రస్తుతానికి బ్రహ్మోత్సవాలకు సంబంధించి టెండర్లను పిలిచామని ఆయన తెలిపారు. వివాదాలకు ఎటువంటి పరిస్థితుల్లో తావు ఇవ్వకుండా శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
ఇకపోతే గత నెల రోజుల (జూన్ 11 – జూలై 10) ఆదాయం రూ.16 కోట్లకు పైగా వచ్చిందని ఈవో అనిల్ తెలిపారు. భక్తులు తిరుమల వస్తున్న నేపథ్యంలో వారు సమర్పించిన తలనీలాల వలన టిటిడికి అదనంగా రూ.7 కోట్లు కు పైగా ఆదాయం లభించిందని తెలియజేశారు. అలాగే తాజాగా స్వామివారి హుండీలో ఓ అజ్ఞాత భక్తుడు 100 గ్రాములు ఉన్న 20 బంగారు బిస్కెట్లను స్వామివారికి హుండీ ద్వారా సమర్పించారని తెలియజేశారు.