లాక్ డౌన్ అంటే చాలా మందికి సరదాగా ఉంది గాని మన దేశానికి ఇది చాలా ప్రమాదకరం అనే విషయం చాలా మందికి అర్ధం కావడం లేదు, మన దేశంలో జనాభా ఎక్కువ, ఉద్యోగులు భారీగా ఉంటారు. ప్రజలకు అందించే సేవలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వైద్య ఆరోగ్య రంగం నుంచి ఆకలి కేకలను తీర్చడ౦ వరకు కూడా మన దేశానికి ఆర్ధికంగా చాలా బలం ఉండాలి. ఒక్క రోజు ఆదాయం ఆగితే మన జీవితాలు ఎన్నో ఇబ్బందులు పడతాయి.
అలాంటిది ఇన్ని రోజుల పాటు లాక్ డౌన్ అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. చాలా మందికి దీని నిర్ణయం వెనుక ఉన్న నష్టాలు అర్ధం కాక ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వస్తున్నారు. లాక్ డౌన్ ఒక్క రోజు ఉంటేనే చాలా వరకు ఆగిపోతాయి. అలాంటిది ఇన్ని రోజులు లాక్ డౌన్ అంటే ప్రభుత్వాల ఆదాయం భారీగా పడిపోయే అవకాశం ఉంటుంది. జీతాలను కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు.
మనకు సంక్షేమ౦ అమలు చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వం ముందు ఉంది. లేకపోతే మీరు తిడతారు ఓటు వేయరు. మీకోసం భారీగా మందులను వాడాలి. అందుకోసం భారీగా మందులకు డబ్బులు ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది. డబ్బులున్న వాళ్ళు వైద్యం చేయించుకుంటారు. లేని వాళ్ళకు ప్రభుత్వమే చెయ్యాలి. ఇక వైద్యుల రక్షణ కోసం భారీగా ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది. వైద్యుల ప్రాణాల కోసం ఆధునిక పరికరాలను దిగుమతి చేసుకోవాలి.
అలాగే ప్రజల ఆకలి కోసం భారీగా ఖర్చు పెట్టాలి. దక్షినాది రాష్ట్రాలు ఏమో గాని ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఆకలి కేకలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్లకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. మీరు ఎన్ని రోజులు బయట పనులు లేకుండా అనవసరంగా తిరిగితే అన్ని రోజులు లాక్ డౌన్ ని పెంచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం. తెలుసుకుని మెసులుకుంటే మంచిది.