రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కి పోటీ కాబోతున్న “పుష్ప”.. అందుకే పాన్ ఇండియా సినిమాగా 5 భాషల్లో ..!

-

స్టైల్ష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియోటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘పుష్ప’. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు సుకుమార్ టీం. ఒకేసారి 5 భాషలకి సంబధించిన టైటిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా కథ 1980ల కాలంలో సాగుంతుందని తాజాగా వచ్చిన సమాచారం. ఇక ‘పుష్ప’ సినిమాను అనుకున్నప్పుడు గాని, మొదలు పెట్టినప్పుడు గాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారని ఎక్కడా రివీల్ చేయలేదు. కానీ రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో మాత్రం ఇది పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కుతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

 

తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తామని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్‌ఫర్మ్ చేస్తూ అన్ని భాషల ఫస్ట్ లుక్ పోస్టర్లనూ విడుదల చేశారు. ఇది నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు ప్రేక్షకులందరీకి స్వీట్ షాక్ అలాగే సర్‌ప్రైజ్ అనుకోవచ్చు. మొత్తానికి ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ ఇంత త్వరగా పాన్ ఇండియా సినిమాతో వస్తాడని ఊహించలేదు.

ఇక ప్రస్తుతం మన టాలీవుడ్ తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘రౌద్రం రణం రుధిరం’ . రాజమౌళి ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు బాగా నెలకొన్నాయి. రాజమౌళి రాం చరణ్, ఎన్.టి.ఆర్ ల ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇటు చిత్ర పరిశ్రమ తో పాటు ప్రేక్షకులలోను విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. రాం చరణ్ వీడియో టీజర్ తో సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఎన్టీఆర్ కి బర్త్ డే గిఫ్టుగా రామ్ చరణ్ కూడా ‘రామరాజు ఫర్ భీమ్’ అన్న ఒక స్పెషల్ వీడియో రెడీ చేపిస్తున్నాడని తాజా సమాచారం.

ఇక రాజమౌళి కి సుకుమార్ గట్టి పోటీ ఇవ్వబోతున్నాడని రీసెంట్ గా రిలీజ్ చేసిన పుష్ప పోస్టర్ చూస్తే తెలుస్తుంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. అయితే పుష్ప కూడా అదే కేటగిరీలో రెడీ అవుతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందుకే ఆర్ ఆర్ ఆర్ కి పోటీగా పుష్ప సిద్దమవుతుందని టాక్ మొదలైంది. ఇక ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ జనవరి 8న రిలీజ్ చేస్తామని రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా పుష్ప కూడా కాస్త అటు ఇటు గా అదే సమయానికి రిలీజ్ అయి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కి పోటీ ఇవ్వనుందట.

Read more RELATED
Recommended to you

Latest news