కన్న ప్రేమ ముందు ఓడిన కరోనా.. తల్లి గుణాన్ని మార్చలేము..

-

కనికరం లేని కరోనా మనుష్షులను అమాంతం మింగేస్తుంది. ఆగమాగం చేస్తుంది. బంధాలు బంధుత్వాలకు విలువలు లేకుండా మనిషిని ఒంటరి చేసి.. మానసికంగా కృంగదీసి నువ్వు ఒంటరివి అంటూ వెక్కిరిస్తూ ప్రాణాలను తీస్తోంది. కరోనా సోకిన నెలల శిశివు దాన్ని జయించి పోపోవే కరోనా అంటూ బోసినవ్వులతో బయటపడ్డాడు. కాదు కాదు ఆ అమ్మే కరోనాను ఓడించి తన బిడ్డను గెలుచుకుంది.

సోషల్‌ మీడియాలో కనిపించిన పోస్టును యథాతదంగా మీకోసం.. అందులోని ఫీల్‌ మిస్‌ కావొద్దనే..

తల్లి రుణాన్ని తీర్చలేము.. తల్లి గుణాన్ని మార్చలేము..

తనకు జెరమొస్తే…
తల్లి బిడ్డను దగ్గరికి రానీయదు..
మనుసుకు బాధనిపిచ్చినా…
కండ్లల్ల నీళ్లు కడుపులకే మింగుకొని జెరం తక్వ చేస్కుంటది..
అదే.. తన కడుపుల పుట్టిన బిడ్డకే జెరమొస్తే…
తన గురించి పట్టిచ్చుకునుడు పక్కకు పెట్టి..
బిడ్డను ఒల్లె పెట్టుకోని కాపాడుకుంటది..
మోసి… కని… పెంచిన తల్లి ముసల్దయిందని..
నడి రోడ్డు మీద ఇడ్శిపెట్టి పోయే సంతానమున్న ఈ రోజుల్ల…
కొడుకుకు కరోనా వచ్చిందని తెల్శినా…
అది పానాల గుత్త రోగమని తెల్శినా..
కొడుకును కడుపుల దాసుకొని కాపాడుకున్నది..
కన్నప్రేమ ముంగట కరోనా ఓడిపోయి.. తోక ముడ్సుకున్నది..
బాల్ నగర్ లో ఉండే ఈ బుడ్డోన్కి, ఆళ్ల నాయ్నకు కరోనా సోకింది.
వాళ్లమ్మకు మాత్రం కరోనా లేదు..
అయినా కరోనాకు భయపడకుండా.. కన్న కొడుకును కాపాడుకొని కరోనాను ఓడగొట్టింది.
గుండె గట్టిగ జేస్కోని కొట్లాడితే యమ ధర్మరాజే గోశి సదురుకొని ఉర్కుతడు…
కరోనా ఎంత… దాని బిషానెంత..?
మంచి తిండి తిని.. పానం గట్టిగ జేస్కుంటే… కరోనానే గాదు… దాని తాతను గూడ గెల్వొచ్చు..
-అజార్‌ షేక్‌

పైన మాటలన్నీ అజార్‌ షేర్‌ అనే జర్నలిస్టువి.. అజార్‌ కూడా కరోనాను అనుభవించి.. జయించి నలుగురికీ దైర్య చెబుతూ వీలైనంతగా సహాయం కూడా చేస్తున్నాడు. ఇలా మంచి మనసున్న మనుషులు మంచి గుండాలే..

Read more RELATED
Recommended to you

Latest news