రెండు వేవ్ కరోనా పిల్లల్లో చాలా మంది దీని బారిన పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ తగ్గిన తర్వాత సోకే మల్టీ సిస్టం ఇన్‌ఫ్లామేటరీ సిండ్రోమ్ (MSI-C) కేసు గుజరాత్‌లో నమోదైంది. విశ్వసనీయ సమాచారం మేరకు గర్భవతి అయిన తల్లికి కొవిడ్ సోకింది. డెలివరీకి ముంచే ఆమె కరోనా నుంచి కోలుకుంది. ఆమెకు పుట్టిన శిశువుకు పుట్టిన 12 గంటల్లోనే ఈ ఎంఐఎస్–సీ ని గుర్తించారు. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో కొన్ని రోజుల కిందట దాదాపు 10 ఇటువంటి కేసులనే గుర్తించారు. అందులో ఇద్దరు పిల్లలు ఈ రోగం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రాజ్‌కోట్‌లో 100 కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్ మేమ్నగర్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. అయితే ఆస్పత్రికి చెందిన డాక్టర్ దెవాంగ్ సొలాంకీ మాట్లాడుతూ అహ్మదాబాద్ వైష్ణోదేవి సర్కిల్ ప్రాంతానికి చెందిన శిశువు తల్లికి నేలన్నర కిందట కరోనా సోకింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ రిపోర్టు ప్రకారం 177 మల్టీ సిస్టం ఇన్‌ఫ్లామేటరీ సిండ్రోమ్ కేసులు చిన్నారుల్లో పోస్ట్ కొవిడ్ కేసులే ఎక్కువ. ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ ఇంటెన్సీవ్ కేర్ ఛాప్టర్ ప్రకారం మొదటి దశ కొవిడ్‌లో దాదాపు 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ కేసులు కేవలం ఢిల్లీలోనే 109 నమోదుకాగా, గురుగ్రాం, ఫరిదాబాద్‌లలో 68 కేసులు నమోదయ్యాయి.
లక్షణాలు..
అ హ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ చైల్డ్ స్పెషలిస్ట్ అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ జోషి ఎంఐఎస్– సీ వ్యాధి పిల్లల్లో వస్తే వాటి లక్షణాలు ఎలా ఉంటాయో తెలిపారు. ఈ వ్యాధి ఏడాది నుంచి 18 ఏళ్ల వయస్సు వరకు వస్తుంది. దీని ప్రభావం పిల్లల్లో అంతగా ఉండదు కానీ, ఒబెసిటీ సమస్య ఉన్నవారికి ఇది ప్రాణాంతకం.
– ఈ వ్యాధి బారిన పడితే పిల్లల్లో జ్వరం, ఎర్రటి దద్దుర్లు, నీరసం, వాంతులు, కడుపు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. ఇంక ఇతర లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
దీనిపై వైద్య నిపుణులు, పరిశోధకులు ఈ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్నారని డాక్టర్ జోషి తెలిపారు. అదేవిధంగా ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటువంటి పిల్లల్లో మూడు రోజుల పాటు జ్వరం ఉంటుంది. డయేరియాతో నీరసం వస్తుంది. నిపుణుల అంచనాల ప్రకారం ఎంఐఎస్–సీ సోకిన పిల్లలకు సాధారణంగా కొవిడ్ తగ్గిన ఆరు వారాలకు ఈ వ్యాధి వస్తోంది. కరోనా బారిన పడిన పిల్లల్లో ఆకస్మాత్తుగా యాంటీబాడీస్ పెరుగుతాయి అది కిడ్నీలకు ఎఫెక్ట్ అవుతుందని తెలిపారు.