క‌రోనాకు చెక్ పెడుతున్న కొత్త మందు.. 24గంట‌ల్లోనే రిక‌వ‌రీ

అస‌లు ఈ క‌రోనాకు ఖ‌చ్చిత‌మైన మందు అనేది ఉందా అని అంతా అనుకుంటున్న టైమ్‌లో ఒక గుడ్‌న్యూస్ వ‌చ్చింది. ఇది వేసుకున్న 24గంట‌ల్లోనే చాలామంచి ఫ‌లితం వ‌స్తుండ‌టంతో అంతా దీనిపై మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం అది కరోనా రోగుల పాలిట సంజీవనిగా పని చేస్తోంది. అదే మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టైల్ డ్ర గ్.

 

ఈ డ్ర‌గ్ ప్రస్తుతం కరోనా రోగులపై సూప‌ర్‌గా ప‌నిచేస్తోంది. ఈ మందు వాడిన త‌ర్వాత క్రిటిక‌ల్ పొజిష‌న్‌లో ఉన్న వారు సైతం నార్మ‌ల్ స్థితికి వ‌స్తున్నార‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఈ డ్రగ్ వైరస్ మ్యుటేషన్లను,స్పైక్ ప్రొటీన్ ని అంటి పెట్టుకుని మానవకణాలలోకి వెళ్ళకుండా నివారిస్తున్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు.

ఐతే క‌రోనా సోకిన 5 రోజులలోపు ఈ కాక్‌టెయిల్ ను ఇస్తే మంచి ఫ‌లితాలు సాధించవచ్చునని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత పెరిగిన వారిపై ఇది పెద్ద‌గా రిజ‌ల్ట్ చూపించలేద‌ని వ‌ర్ణిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న వివిధ మెడిసిన్ల‌తో పోల్చినప్పుడు ఈ మందు 70% ఎక్కువ ఫలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డ్ర‌గ్‌ను సిప్లా ఫార్మా తయారు చేస్తోంది. దీని ధ‌ర రూ.6వేల‌కు రెండు డోసులు.