రియల్‌మి ఫోన్‌ను మీరు ఉపయోగిస్తున్నారా..? అయితే ఈ శుభవార్త మీకోసమే.. రియల్‌మి స్మార్ట్‌ఫోన్లకు గాను ఆ కంపెనీ అందిస్తున్న వారంటీని 30 రోజులు పొడిగిస్తున్నట్లు తెలిపింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 30వ తేదీల మధ్య రియల్‌మి ఫోన్ల వారంటీ గడువు ముగిసేవారికి ఈ అవకాశం అందిస్తున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. కరోనా ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని రియల్‌మి వెల్లడించింది.

మార్చి 20 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు వారంటీ గడువు ముగిసే రియల్‌మి ఫోన్లకు ఆ గడువును మే 31వ తేదీ వరకు పెంచుతున్నట్లు రియల్‌మి తెలిపింది. దీంతో కస్టమర్లు అదనంగా మరో నెల రోజుల పాటు ఎలాంటి రుసుం చెల్లించకుండానే వారంటీని పొందవచ్చు. ఇక కస్టమర్లు తమకు ఉండే సందేహాలపై 1800 1022 777 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని రియల్‌మి తెలిపింది. ఈ క్రమంలో తమ కాల్ సెంటర్ నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ తెలిపింది.
కాగా కరోనా నేపథ్యంలోనే తమ కస్టమర్ల ఫోన్లకు నెల రోజుల పాటు ఎలాంటి అదనపు చార్జిలు లేకుండా వారంటీని పెంచుతున్నట్లు రియల్‌మి తెలిపింది.