దేశంలో 1079 కరోనా మరణాలు.. మహారాష్ట్ర టాప్‌

-

భారత్ లో కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది గాని తగ్గే అవకాశాలు ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు. కరోనా తీవ్రతను కట్టడి చేయడానికి లాక్ డౌన్ ఉన్నా సరే కేసులు మాత్రం భారీగా నమోదు అవుతున్నాయని అర్ధమవుతుంది. దేశవ్యాప్తంగా కొత్తగా 1,813 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 31,787కు చేరుకుంది. ఇప్పటి వరకు 7,796 మంది కరోనా నుంచి బయటపడ్డారు.

ఇక మరణాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతూ వస్తుంది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 71 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో 16, మధ్యప్రదేశ్‌లో 6, యూపీలో 5 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర నుంచే 432 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే దేశంలో మరణాలు వెయ్యిదాటి 1079 కి చేరడం ఆందోళన కలిగించే అంశం.  రాబోయే వారం రోజుల్లో మరణాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. గుజరాత్‌ నుంచి 181, మధ్యప్రదేశ్‌ నుంచి 119, ఢిల్లీ నుంచి 54 ప్రాణాలు కోల్పోయారు.

గుజరాత్, దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత చాలా అధికంగా ఉంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా సరే దాని పని అది చేసుకుంటూ పోతుంది గాని ఎక్కడా కూడా తగ్గే అవకాశాలు కనపడటం లేదు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ని ఎత్తేస్తే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news