కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్‌

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో ఆదివారం వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

top 10 covid 19 updates today on 28th june 2020

1. కరోనా వైరస్‌ మహమ్మారి, చైనాతో సరిహద్దు వివాదం.. వెరసి భారత్‌ రెండు యుద్ధాలను ప్రస్తుతం ఎదుర్కొంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. ప్రధాని మోదీ ఈ రెండు యుద్ధాల్లోనూ గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

2. తెలంగాణ రాష్ట్రంలో గత వారం, పది రోజుల నుంచి భారీగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ మరోసారి లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకోనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున కేవలం హైదరాబాద్‌ వరకే కొద్ది రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తే బాగుంటుందని వైద్య నిపుణులు, మంత్రులు చెప్పడంతో ఆయన ఈ విషయంపై మరో నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.

3. ఏపీలో గడిచిన 24 గంటల్లో 813 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 13,098 కేసులు నమోదయ్యాయి. ఇక మొత్తం 169 మంది మృతి చెందగా, 5908 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 7021 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు.

4. తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో 180 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్దారణ అయింది. శిక్షణలో ఉన్న 100 మంది ఎస్‌ఐలతోపాటు మరో 80 మంది సిబ్బందికి కరోనా సోకింది.

5. ప్రధాని మోదీ కరోనా మహమ్మారి, చైనాతో సరిహద్దు వివాదంపై మన్‌ కీ బాత్‌లో మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలు వదిలిన అమరుల త్యాగాలను మరువలేమని అన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కన్నా ప్రజలు ఇప్పుడే మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా సమస్య పూర్తిగా తొలగిపోతే భారత్‌ శక్తివంతమైన దేశంగా మారుతుందని అన్నారు.

6. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) కోల్‌కతాలో చేపట్టిన సర్వేలో షాకింగ్‌ విషయం వెల్లడైంది. అక్కడి జనాభాలో 14 శాతం మందిలో కరోనా వైరస్‌ యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడ రానున్న రోజుల్లో భారీగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

7. కరోనాకు సంబంధించి మరో మూడు కొత్త లక్షణాలను సైంటిస్టులు జాబితాలో చేర్చారు. వికారంగా ఉండడం లేదా వాంతులు కావడం, డయేరియా (విరేచనాలు), ముక్కు నుంచి నీరు కారడం తదితర మూడు లక్షణాలు ఉన్నా కూడా కరోనాగా అనుమానించాలని చెప్పారు.

8. కరోనా బారిన పడ్డవారికి టైప్‌ 1 డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుందని వారు తెలిపారు.

9. కరోనా మహమ్మారి తుఫాను లాంటిదని, తుఫాన్లు ఎన్నో రోజులు ఉండవని, కొద్ది రోజులకు ఏ తుఫాన్‌ అయినా అంతం కావల్సిందేనని.. అలాగే కరోనా కూడా కొంత కాలానికి అంతం అవుతుందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రజలు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

10. మహారాష్ట్రలో కొత్తగా నిర్మించిన ప్లాస్మా థెరపీ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news