బ్రేకింగ్; జెఎన్‌యు దాడిలో పాల్గొన్న అమ్మాయిని గుర్తించిన పోలీసులు…!

-

గత వారం ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) లో జరిగిన దాడి వీడియోల్లో కనిపించిన ముసుగు ధరించిన మహిళను ఢిల్లీ పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. చెకర్డ్ షర్ట్, లేత నీలం కండువా ధరించి, కర్ర తీసుకువెళ్తున్న ఓ మహిళ ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థినిగా అనుమానిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపిన 49 మందిలో ఆమె కూడా ఉంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ లు మరియు హాస్టల్ వార్డెన్లు, సెక్యూరిటీ గార్డ్లు మరియు విద్యార్థుల స్టేట్మెంట్ల ఆధారంగా గాయపడిన విద్యార్థి సంఘం నాయకురాలు, ఐషే ఘోష్తో సహా తొమ్మిది మంది నిందితులను శుక్రవారం గుర్తించారు. ఇక ఇదిలా ఉంటే ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణను ముమ్మరం చేసింది. దాదాపు వంద మందికి పైగా విద్యార్ధులను విచారించే అవకాశం ఉంది.

నోటీసులు పంపిన ఇతరులలో “యూనిటీ ఎగైనెస్ట్ లెఫ్ట్” అనే వాట్సాప్ గ్రూపులో భాగమైన 37 మంది ఉన్నారు. సోమవారం నుంచి సిట్ విచారణ మొదలు కానుంది. అయితే ఈ ఘటనలో ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంఘం ఏబీవీపిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇక బయటి వ్యక్తులను ఆ సంస్థ లోపలి తీసుకొచ్చిందని, కావాలని విద్యార్ధులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని ఆరోపణలు వినపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news