తెలుగు విద్యార్థితో తెలుగులో మోడీగారి ఆసక్తిసర సంభాషణ…

-

మోడీగారు తెలుగులో మాట్లాడడం అప్పుడప్పుడు చూసాం. ఇక్కడికి వచ్చినపుడు తెలుగులోనే పలకరిస్తుంటారు. ఐతే తాజాగా మోడీగారు తెలుగు విద్యార్థితో జరిపిన సంభాషణ ఆసక్తిగా మారింది. ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీలోని లక్ష్మీబాయి వ్యవసాయ విశ్వ విద్యాలయ విద్యార్థులతో ముచ్చటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోడీగారు అక్కడి తెలుగు విద్యార్థి క్రిష్ణా జిల్లాకి చెందిన టోనీ మనోజ్ కుమార్ తో మాట కలిపారు. దానికి కారణం ఆ విద్యార్థి పేరే.

టోనీ మనోజ్ కుమార్ అని చెప్పగానే, టోనీనా, మనోజ్ కుమారా అని మోడీగారు అడగ్గా, ఆ విద్యార్థి తన పూర్తి పేరు టోనీ మనోజ్ కుమార్ అని చెప్పాడు. అప్పుడు ఐతే మీరు టోనీ గారన్న మాట అని నవ్వులు పూయించారు. ఇంకా మనోజ్ కుమార్ మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం కాబట్టి తాను తెలుగులోనే మాట్లాడతానని కోరగా, అలాగేనని చెప్పి, తాను మాట్లాడిన మాటలకి మోడీగారు చక్కగా ప్రతిస్పందించారు.

మనోజ్ కుమార్ తెలుగులో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుతం అమలు చేస్తున్న సంక్షేమ, వ్యవసాయ కార్యక్రమాలు ప్రజలకి మేలు చేస్తున్నాయని, దానికి కృతజ్ఞతలు తెలియజేసాడు. అంతేగాక అంధ్రప్రదేశ్ లో పండే పసుపు, మామిడి వాటి గురించి తమ తోటి విద్యార్థులకి వివరిస్తున్నానని తెలిపాడు. ఐతే టోనీ మనోజ్ కుమార్ మాట్లాడిన తెలుగు మాటలు తనకి అర్థమయ్యాయని మోడీగారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news