ప‌రీక్ష‌ల‌పై మోదీ చ‌ర్చిస్తార‌నుకుంటే బొమ్మ‌ల‌పై చ‌ర్చించారు: రాహుల్ గాంధీ

-

కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ మ‌రోసారి ప్ర‌ధాని మోదీపై విమ‌ర్శ‌లు సంధించారు. దేశ‌వ్యాప్తంగా ఓ వైపు విద్యార్థులు జేఈఈ, నీట్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాల‌ని కోరుతుంటే మోదీ ప‌రీక్ష‌ల‌పై కాకుండా బొమ్మ‌ల‌పై చ‌ర్చ పెట్టార‌ని అన్నారు. క‌రోనా నేప‌థ్యంలో విద్యార్థులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నార‌ని, ఈ స‌మ‌యంలో ప‌రీక్ష‌ల‌ను రాయ‌లేమ‌ని అంటుంటే.. కేంద్రం వారి బాధ‌ను అర్థం చేసుకోవ‌డం లేద‌న్నారు.

pm modi made toys charcha not pariksha charcha says rahul gandhi

జేఈఈ, నీట్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాల‌ని రాహుల్‌గాంధీ అన్నారు. ప్ర‌ధాని మోదీ త‌న మ‌న్‌కీ బాత్‌లో ప‌రీక్ష‌ల‌పై కాకుండా బొమ్మ‌ల‌పై చ‌ర్చ పెట్టార‌ని రాహుల్ విమ‌ర్శించారు. ఈ క్ర‌మంలో రాహుల్.. మ‌న్‌కీ న‌హీ స్టూడెంట్స్ కీ బాత్ పేరిట ట్వీట్ చేశారు. ప‌రీక్షా పే చ‌ర్చా ఉంటుంద‌నుకుంటే ఖిలోనే పే చ‌ర్చా చేశార‌ని ట్వీట్ చేశారు.

కాగా క‌రోనా నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్ 1 నుంచి అన్‌లాక్ 4.0 అమ‌లు కానున్న దృష్ట్యా ప్ర‌ధాని మోదీ ఆదివారం మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. దేశ యువ‌తలో అద్భుత‌మైన బొమ్మ‌లు త‌యారు చేసే శ‌క్తి ఉంద‌ని, అంత‌ర్జాతీయ బొమ్మ‌ల‌కు దీటుగా యువ‌త బొమ్మ‌ల‌ను త‌యారు చేయాల‌ని పిలుపునిచ్చారు. దీనిపైనే రాహుల్ విమ‌ర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news