జనవరి 26.. గణతంత్ర దినోత్సవం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీ నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 200సంవత్సరాలు పాలించిన బ్రిటీషు వారి నుండి విముక్తి పొంది సొంతంగా రాజ్యాంగాన్ని రూపుదిద్దుకున్న రోజు. ఐతే జనవరి 26వ తేదీన జరుపుకోవడానికి మరో కారణం కూడా ఉంది. 1929లో నేషనల్ కాంగ్రెస్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి, సెల్ఫ్ రూల్, మా దేశాన్ని మేమే పాలించుకుంటామని జనవరి 26వ తేదీన ప్రకటించింది.

అందుకే ఇదే రోజున రాజ్యాంగం అమల్లోకి వచ్చి, గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు.ఈ రోజున భారతదేశం కోసం ప్రాణాలర్పించిన ఎందరో మహానుభావులకి నివాళులు అర్పించడంతో పాటు వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ, వారు చూపిన స్థైర్యాన్ని, ధైర్యాన్ని, స్ఫూర్తిని మనలో నింపుకుంటూ భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేయాలి.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోషల్ మీడీయాలో చక్కర్లు కొడుతున్న సందేశాలివే.
మనదేశంపై మనకుండే ప్రేమని చూపించడం మరువవద్దు.
జ్ఞానం వయసు వల్ల రాదు. చదవడం, నేర్చుకోవడం వల్ల వస్తుంది. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మనసులో స్వేఛ్ఛ
మాటల్లో బలం
రక్తంలో స్వఛ్ఛత
ఆత్మలో గర్వం
గుండెల్లో కుతూహలం
కలుపుకుని భారతదేశానికి రాజ్యాంగాన్ని సమకూర్చి, దేశానికి దిశానిర్దేశం చేసిన వారికి నమస్కరిస్తూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
గణతంత్ర రాజ్యాన్ని అందించడానికి ఎంతగానో శ్రమించిన వారందరినీ గుర్తు చేసుకుంటూ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
భారత వారసత్వ సంపదను గౌరవిస్తూ, అందులో ఉంటున్న నాతో పాటు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
