జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడ….?

-

తెలుగుదేశం పార్టీ-జనసేన మధ్య ఓ పక్క పొత్తుల చర్చలు జరుగుతుండగా.. మరో ప్రక్క జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో గాజువాక , భీమవరం స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్….. పొత్తు నేపథ్యంలో ఈ సారి ఒక్క స్థానంలోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో పవన్ ఈ రెండు స్థానాల్లో ఏదో ఒకటి ఎంచుకుంటారా? లేక కాకినాడ సిటీ, పిఠాపురం, కొత్తపేట, తిరుపతి, భీమిలి స్థానాలను పరిశీలిస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే….పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.ఈ మేరకు పర్యటనకు సంబంధించిన అధికారిక వివరాలు పార్టీ నేతలు వెల్లడించారు.ముందుగా బీమవరం నియోజకవర్గంలో తొలి సభ నిర్వహించనున్నారు.అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news