Women’s Day : భారతీయ సినిమాకు తన ప్రతిభ ఏంటో చూపించిన మహిళ…!

-

ఆడవాళ్ళు అన్ని రంగాల్లోను రాణించగలమని నిరూపించారు. తమకు సాధ్యం కాని పని లేదని చేసి చూపించారు. నాడు నేడు ఆడవారు అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార, సినీ, ఉద్యోగ రంగాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. సినిమా విషయానికి వస్తే మేము కథానాయికలం మాత్రమే కాదు కథను సినిమా తీయగల సత్తా మాకు ఉందని నిరూపించారు.

- Advertisement -

ఎందరో గొప్ప గొప్ప నటీమణులు నటనలోనే కాక దర్శకత్వ పర్యవేక్షణ కూడా తమకు తామే సాటి అని నిరూపించారు. మన తెలుగు చిత్ర పరిశ్రమలో చూస్తే నాటి నుంచి నేటి వరకు వెండితెరకు అందమైన కథానాయకులుగా పరిచయమైన వారిలో కొంతమంది హీరోయిన్స్ దర్వకత్వం వైపు అడుగులు వేసారు. తెలుగు చిత్ర పరిశ్రమ విషయాన్ని చూస్తే అప్పట్లో భానుమతి చండీరాణి వంటి పలు సినిమాలను డైరెక్టర్ చేసి నటిగా, దర్శకురాలిగా తనకు సాటి లేదని నిరూపించింది.

మహానటి గా పేరుపొందిన సావిత్రి తాను నటనలో మాత్రమే కాదు దర్శత్వ ప్రతిభ కూడా తనలో ఉందని చిన్నారి పాపలు, మాతృదేవత వంటి సినిమాలను దర్శకత్వం వహించి దర్శకురాలిగా నిరూపించుకుంది. ప్రపంచంలో అత్యధిక చిత్రాలు డైరెక్ట్ చేసిన మహిళ గా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన కధానాయిక మన విజయనిర్మల. ఆ తరువాతి తరం కూడా మేము ఉన్నాం అని ముందుకు వచ్చిన నటీమణులు రేవతి, జీవిత రాజేఖర్.

జీవిత తన భర్త రాజశేఖర్ హీరో గా ‘శేషు, ఆప్తుడు, ఎవడైతే నాకేంటి, ‘సత్యమేవ జయతే’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక రేవతి విషయానికి తమిళ, తెలుగు, కన్నడ భాషలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న రేవతి ఫిర్ మిలేంగే’, ‘కేరళ కేఫ్’, ‘ముంబై కటింగ్’ లాంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రేణుదేశాయ్ ఈమె కూడా తనలోని దర్శకత్వ ప్రతిభను కనబరిచారు.

తన సొంతంగా కథ రాసుకొని చేసిన సినిమా ఇష్క్ వాలా లవ్, ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఆదరణ వచ్చింది. ఈ సినిమాను రేణు దేశాయ్ మరాఠిలో తీసి సక్సెస్ సాధించింది. ‘మణికర్ణిక’ సినిమాతో మెగాఫోన్ పట్టకుంది హీరోయిన్ కంగనా రనౌత్, సినిమాను కంగనా డైరెక్టర్ క్రిష్‌తో కలిసి డైరెక్ట్ చేసింది. దర్శకురాలిగా అభిమానుల ప్రశంసలు అందుకుంది కంగనా. హీరోయిన్ నందితా దాస్ కూడా దర్శకురాలిగా సత్తా చూపెట్టింది.

నటి పూజా భట్ కూడా ‘పాప్’,జిస్మ్ 2’ సినిమాలను డైరెక్ట్ చేసింది. తమిళం, తెలుగులో చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన శ్రీ ప్రియ కూడా దృశ్యం సినిమాకు దర్శకత్వం వహించారు . బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమా మాలిని కూడా ‘ ఏ దిల్ ఆషియానా’ సినిమాతో డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టుకుంది. ‘ఫిరాక్’, భవందర్’ వంటి సినిమాలతో దర్శకురాలిగా సత్తా చాటింది. సోనమ్ కపూర్, దియా మీర్జా కూడా దర్శకత్వం వైపు అడుగులు వేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.

తెర ముందు నటించడం మాత్రమే కాదు తెర వెనుక బాధ్యతలను కూడా మేము సమర్థవంతంగా నిర్వర్తించగలం అని నిరూపించుకున్నారు. ఇక ముందు వీరి స్ఫూర్తితో మరింతమంది నటీమణులు దర్శకత్వం వైపు రావడంలో ఆశ్చర్యం లేదు. బాలీవుడ్ లో అయినా టాలీవుడ్ లో అయినా ఎందరో హీరోయిన్లు నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రియాంకా చోప్రా, అనుష్క శర్మ వంటి వారు తమ సత్తాను చూపించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...